పూజామందిరంలో ప్రవాళ హనుమంతుని ప్రతిమ ఉంటే శ్రేష్టం. ప్రవాళం అంటే పగడం. పగడంతో తయారు చేసిన ఆంజనేయుని ప్రతిమ అత్యంత శక్తివంతమైంది. దీన్ని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి.
ఆంజనేయుని బలం అనంతం. శక్తికి, ధైర్యానికి మారుపేరు హనుమంతుడు. ప్రవాళ హనుమంతుని విగ్రహం పూజా మందిరంలో ఉన్నట్లయితే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలకు లోను కారు. ప్రవాళ హనుమంతుని పూజించడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ప్రవాళ హనుమంతుని దర్శించుకుంటే, పీడకలలు రావు.
ప్రవాళ ఆంజనేయుని స్మరిస్తే చింతలూ, సమస్యలూ సమసిపోతాయి. ధైర్యంగా ఉంటుంది. ప్రవాళ హనుమంతుని పూజలో హనుమాన్ చాలీసా పఠిస్తే శాంతి చేకూరుతుంది. ప్రవాళ ఆంజనేయుడు పిలిస్తే పలుకుతాడు. భక్తుల మొర ఆలకిస్తాడు. కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. ఎల్లవేళలా తమకు రక్షణగా ఉండాలని, ధైర్యాన్ని సమకూర్చాలని భక్తులు ప్రవాళ హనుమంతుని ఆరాధిస్తారు.
ప్రవాళ హనుమంతుని పూజకు ఆర్భాటాలు ఏమీ అక్కరలేదు. నిండైన మనసుతో
"ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం సర్వగ్రహ వినాసినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వ దుఃఖ హరాయ నమః
ఓం సర్వబంధ విమోచ్యే నమః.."
అని 11సార్లు స్మరించాలి.
''ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్టాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయస్తు నమో మర్కట రూపిణే
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వమే వాసు హనుమాన్ రాక్షసాంతక
యశోజయంచ మే దేహి శతృన్ నాశయ
స్వాశ్రితానాయ భయదం య ఏవం సౌత్తి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవత్''
అని పఠిస్తూ ప్రవాళ హనుమంతుని పూజిస్తే చాలు, సమస్యలు తీరి సుఖసంతోషాలు అనుభూతిలోకి వస్తాయి.