|
Hanumacharitra | hanuman | manuma | brama | saraswathi | shiva | parvathi | lakshimi | kesari | anjana | anjanadevi | hanumalealalu.
|
సేతుబంధనం – గోవర్ధనగిరి |
|
సముద్రమునకు వారధి ఏర్పడిన తర్వాత హనుమంతు డెన్నియో పర్వతముల నెత్తుకొని వచ్చెను. సేతువు పూర్తియగు చుండగా ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతమును తీసుకుని వచ్చుచుండెను.ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరము సాగుసరికి సేతు నిర్మాణము పూర్తి యై పోయినదని తెలియవచ్చినది. ఇక పర్వతము తీసుకొని వెళ్ళుటవలన ప్రయోజనమేమి? – అనుకుంటూ అతడు దాని నచ్చటనే విడచివేసెను. కానీ, అది సాధారణ పర్వతము కాదు. దాని ఆత్మ ప్రకటితమై “భక్త రాజా! నేను చేసిన అపరాధమేమి? మీ కరకమలముల స్పర్శను పొంది కూడా నేను భగవత్సేవా వంచితుడ నగుచున్నానే? నన్నిక్కడ విడువ వద్దు. భగవత్సమీపమునకు తీసుకుని వెళ్లి వారి శ్రీ చరణారవిందముల చెంత నుంచుము. లేదా నన్ను సముద్రగర్భములో పారవేయుము. భగవత్సేవ కుపయోగింపని జీవితమువలన ప్రయోజనమేమి?” అనెను.
|
|
“గిరిరాజా! నీవు వాస్తవమునకు గిరిరాజువే. నీ అంచంచల నిష్టను చూచుచుండ నిన్ను భగవత్సమీపమునకు తీసుకొని వెళ్ళవలె ననియె యున్నది. కానీ ఇక ఏ పర్వతమునూ తీసుకొని రావద్దని రామచంద్ర ప్రభువు ఆవాదేశించారు. అయిననూ నీ కొరకు భగవానుని ప్రార్థించెదను. వారి యాదేశానుసారము చేసెదను” అని పలికి హనుమంతుడు, రామచంద్రప్రభువును చేరి సమాచారమంతయూ వివరించి చెప్పెను. అంత భగవానుడు ‘హనుమంతా! ఆ పర్వతము నాకు అత్యంత ప్రేమపాత్రమైనది.నీవు దానిని ఉద్ధరించినావు. ద్వాపర యుగములో నేను కృష్ణరూపములో దానిని ఉపయోగించు కొనెదనని చెప్పుము. ఏడురోజులపాటు దానిని నా వేలిమీద ఉంచుకొని ప్రజలను రక్షించెదను” అనెను. అంత హనుమంతుడు వజ్రభూమిని చేరి గోవర్ధనగిరికి భగవత్సందేశమును వినిపించెను. హనుమంతుడు వలన గోవర్ధనము భగవానునికి పరమ కృపాపాత్రమై, నిత్యలీలా పరికరమాయెను.
|
|
|
|
|