|
Hanumatcharitham | hanuma | charitra | anjanaa | mahemdrudu | devi | vanaram | shamkarudu | manava | rupam | vinayam |sree |ssri
|
అంజనాదేవీ వృత్తాంతము |
|
మహేంద్రుని అమరావతీ నగరంలో ''పుంజికస్థల''అను అప్సర ఉండేది .ఒకానొక సమయంలో ఆమె వలన జరిగిన అపరాధమువలన నొక మహర్షి ఆమెను వానర యోనియందు జన్మి౦చుమని శపించెను . ఆమె అత్యంత వినయభావంతో అనేక రీతుల ప్రార్ధింపగా అతడనుగ్రహించి ఆమె ఎప్పుడు ఎట్టిరూపము ధరింపవలెననుకోనునో అట్టి రూపము ధరించవచ్చునని వరము నిచ్చియుండెను.తత్కారణమున ఆమె మనవిగా కానీ , వానరిగాకానీ యధేచ్చగా సంచరించుటకు అవకాశము లభించెను. ఆమెయే అంజనాదేవి .వానర రాజైన కేసరి ఆమెను భార్యగా స్వికరించెను. సుందరాంగియైన ఆమె నతడు ఎంతయో అనురాగముతో చుచుకోనుచుండేను . |
|
ఒకనాడు వారిరువురూ మానవరూపములు ధరించి తమ రాజ్యమందలి సుమేరుగిరి శృ౦గముపై విహరింప సాగిరి .అప్పుడు వాయువు మందమందముగా వీచుచుండెను .ఆదంపతులట్ల విహరించుచుండగా వాయుతరగం ఒకటి ఆ౦జన చీర చెంగును ఎగురకోట్టేను .తనను ఎవరో స్పృశించుచున్నట్లు అంజనకు అనిపి౦చెను .ఆమె తన వస్త్రము ను సరిచేసుకుని నేరుగా నిలిచి గద్ది౦చుచు,''నాపాతివ్రత్యమును భంగా పరచ సాహసించు వారెవరు?నే నిప్పుడే అట్టివానిని శపించి భస్మముచేసెదను ''అన్నది అందుకు జవాబుగా ''దేవీ !నేను వాయుదేవుడను .నా స్పర్సవల్ల నీ పాతివ్రత్యము భంగము కాలేదు శక్తిలో ,నాతో సమానమైన సుపుత్రుడు నీకు కలుగగలడు.బాలబుద్ద్యాదులందు వానిని తిరస్కరించగలవారెవరు ఉండరు .నే నతనిని సర్వదా రక్షి౦చు చుందును.ఆ చిరకాలంలో నీకు కలుగబోవు భగవత్సేవకుడై ఆదర్శ మార్గాగామియై ఆచంద్రారార్కామైన సత్కీర్తిని సముపార్జించగలడు '' అను సమీరదేవుని పలుకులు అంజనకు వినిపించెను .తదనంతరము అంజనాకేసరులు స్వస్తానమునకు వెడలిపోయిరి .శంకరభగవానుడు నిజంశతో శ్రవణే౦ద్రియము గుండా ఆమెగర్భమందు ప్రవేశించెను. శ్రీమత్ వైశాఖ బహుళ దశమి శనివారం నాడు శ్రీ శంకర భగవానుడు అంజనా గర్భమున నుండి వానర రూపంలో అవతరించెను. (కొందరి మతానుసరము కార్తీక కృష్ణ చతుర్దశి హనుమ జ్జన్మతిధిగా ప్రకటించెను ). అంజనాకేసరుల ఆనందమునకు మేరలేక పోయాను .శుక్లపక్షచంద్రునివలె వర్దిల్లుచు బాలుడు అల్లారు ముద్దుగా పెంచబడు చుండెను .అంజన ఎక్కడికైనను వేల్లుచో బిడ్డను హృదయమునకు హత్తుకుని తీసుకుని వెళ్ళేడిది.కేసరి తన కుమారుని వీపుపై నెక్కించుకుని గంతులు వేయుచూ ప్రియ తనయ డానందించుచు౦డుటను చూచి తానునూ పరమానంద మొందుచుండేడివాడు. |
|
|
|
|