ఇదంతయూ ఎందులకు ? తన దేవుని తో ఆడవలెననియు, అయన మధురలీలలను దర్శింపవలెననియూ, అయన నానందింపజేయవలెననియూ వచ్చినాడు.
బాలరాముడా వానరక్రీడను తిలకించి ఆకర్షింపబడినాడు. ఆ సుందర వానర క్రీడను చూచి అందరూ వెడలిపోయెను. కానీ బాలరాముడు మాత్రము కదలలేదు.’నా కీ కోతి కావలెను ‘ అని పట్టుబట్టినాడు .రాకుమారుడు, అందులో బలరామచంద్ర ప్రభువు తలచినచో ఏది జరగదు? ఆ కోతులు నాడించు వానికి ఎంత ధనమైననుసరే ఇచ్చి రాముడు కోరిన వానరము తీసుకొని రావలసిందిగా దశరధ మహారాజు సేవకులను కదేశించినాడు. కోతుల వాడు ధన ధాన్యాలను కొరకు రాలేదు . తనను తాను శ్రీ రామచంద్ర ప్రభు చరణ కమలము లందు సమర్పణము చేసికొనుటకై వచ్చినాడు. అందువలన, తక్షణమే తనకోతిని రామునకప్పగించినాడు. రామచంద్రుడా కోతిని చేతులోనికి తీసుకొనెను.
అంతవరకూ ఆ వానరము తనను తానే ఆడించుకొనుచున్నది. ఇప్పుడు రామచంద్ర ప్రభువే దాని నాడి౦చ సాగినాడు. యుగయుగమలనుండి కలిగిన కోరిక
ఆ నాటికి నెరవేరినది . అది ఆనందాతిరేకముతో ఆడసాగినది. ప్రజలందరూ ఆ దివ్య వానర నాట్యము చూచి ముగ్ధులైపోయినారు. అదే సమయంలో ఆ కోతుల వాడు అదృశ్యమైపోయినాడు.ఆ కోతులవాడు ఈ కోతిలోనే లీనమైనాడో లేక పని పూర్తియగుటతో నిజనివాసమైన కైలాసమునకు మరలి పోయినాడో తెలియదు.
ఆ రూపము లోనే హనుమంతు డక్కడ చాలాకాలము రామచంద్రుని సేవించుకొనుచు ఉండిపోయెను. అంతట ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన యాగరక్షణార్ధమై రమ లక్ష్మణులను గొనిపోవ వచ్చినప్పుడు భగవానుడు హనుమంతుని చేరబిలిచి – “హనుమా!నీవు నా అంతరంగ సఖుడవు . నీకు తెలియని లీలలు నాలో ఏమియూ లేవు . భవిషత్తులో నెను రావన సంహారము చేసెదను. తత్సమయంలో నాకు వానర సహకారము కావలసియున్నది.ఖర,దూషణ,త్రిశిర,శూర్పణఖాదులు దండకారణ్యములో ఉంటున్నారు. మారీచ సుబాహు, తటకాదులు మనకు సమీపమందే నివసిస్తూ ఉన్నారు. వారి మాయాజాలములు సర్వత్రా వ్యాపించి యున్నవి . నీవు శబరిని కలుసుకొని ఋష్యమూక పర్వతము చేరుకొని సుగ్రీవునితో మైత్రిని వర్ధిల్లచేసుకొనుము నెను మార్గము నిష్కంటకము చేసికొనుచూ క్రమముగా అక్కడకు వచ్చెదను అప్పుడు నీవు నాకూ సుగ్రీవునకూ మైత్రిని ఏర్పాటు చేయుము . అనంతరం నేను రావణు నంతమొ౦ది౦చి అవతార కార్యమును నెరవేర్చెదను” అనెను.
తన ప్రభువును విడనాడి వెళ్ళవలెనని ఎంతమాత్రమూ లేకపోయిననూ, హనుమంతుడు, భగవదాజ్ఞ శిరోధార్యము చేసుకుని, రామన్నామస్మరణము చేసుకొనుచూ ఋష్యమూక పర్వతము చేరుకొనెను. |