అంత వాయుదేవుడు బాలుని లేవనేత్తుకుని గుహలోనికి వెళ్ళిపోయేను .ఇంద్రునిపై తీవ్ర క్రోథము గలిగెను. వెనువెంటనే అతడు తన గతిని బంధిచేను. వాయుప్రసారము లేకపోవుటతో ప్రపచంమంతటా కల్లోలము బయలుదేరును. ముల్లోకములలోనూ ఏదియును కదలుట లేదు. అందరి శ్వాస కార్యములనూ బంధింపబడిపోయ్యెను. దేవతలు భయపడిపోయిరి.మహేంద్రుడు పరిగెత్తుకొచ్చేను.
బ్రహ్మదేవుని సమీపించి గత విషయములను వివరించెను. అంత విధాత దేవతా ప్రముఖులను వెంటబెట్టుకొని ఆ పర్వత గుహలోనికి వచ్చి, బాలుని స్పర్శించుసరికి అతడు మహాదానందముతో లేచి నిలచెను. |