శ్లో || అతులిత బలధామం స్వర్ణశైలాభా దేహం
దనుజ వన క్రుశానుం జ్ఞానినా మగ్రగాణ్యం
సకలగుణ నిధానం వానరాణా మధిశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ||
శివ నిర్ణయం
శంకర భగవానుడు సతీదేవితో మహొత్తుంగ కైలాస శిఖరముపై విరాజిల్లుచుండేను.వటవృక్షచ్చాయలో కర్పూర సదృశమగు అతని ధవళ గాత్రము పై జాటాజూటము శోభిల్లు చున్నది .
|