English | Telugu

ట్రైలర్లోనే పొట్ట చెక్కలు చేశాడు మహానుభావుడు!

on Sep 19, 2017

‘అతి శుభ్రం’... ఇదో శాపం. ఇది ఉన్నోడికీ ఇబ్బందే... పక్కోడికీ ఇబ్బందే. మురికోడితో అయినా.. జర్నీ చేయొచ్చుకానీ... అతి  శుభ్రం గాడితో క్షణం కూడా ఉండలేం. సమకాలీన వ్యవస్థలో సగటుమనిషికి ఎదురయ్యే సమస్యల్లో ఇది కూడా ఒకటి. దీన్నే ప్రధానాంశంగా తీసుకొని దర్శకుడు మారుతీ తెరకెక్కించిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘మహానుభావుడు’. 


మారుతి గతంలో చేసిన ‘భలే భలే మగాడివోయ్’కు మతిమరుపును ప్రధానాస్త్రం అయితే... ఈ సినిమాకు ‘అతిశుభ్రం’ప్రధానాంశం.  జనాలకు త్వరగా కనెక్టయ్యే పాయింట్ ఇది. కామెడీ అనేది ప్రత్యేకంగా ఉండదు. ఇలాంటివాటి నుంచే పుడుతుంది. ఆ విషయాన్ని భలే క్యాచ్ చేశాడు మారుతి. ‘మహానుభావుడు’... ట్రైలర్లోనే పగలబడి నవ్వించేశాడు. 
బురద కనిపించిందని పక్కోడి బండిని కడిగేయడం... నీళ్లు లేని వాష్ రూమ్ వాడాడని పక్కోడ్ని కొ్ట్టేయడం... ప్రేమించిన అమ్మాయి తండ్రి తుమ్మాడనీ... పక్కకెళ్లి ఫోన్లో మాట్లాడుతూ కవర్ చేయడం... ఒకటా రెండా ఇందులో శర్వా చేస్తున్న శకలు చేస్తుంటే.. నవ్వకుండా ఉండలేం. 


మరి ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మెహ్రిన్ కౌర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here