ఏ దరిద్రుడు క్రియేట్ చేశాడో!
on Sep 19, 2017

నాగబాబుకి కోపం వచ్చిందండోయ్. ‘ఎవడో .. ఆ దరిద్రుడు’ అంటూ అంతెత్తున లేచారు. ఇంతకీ ఆయకు అంత కోపం తెప్పించిన విషయం ఏంటనుకుంటున్నారా? నిహారికా, సాయిధరమ్ తేజ్ వరుసకు బావామరదళ్లు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారన్న వార్త... ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై ఇటీవల జరిగిన ఓ ఇంటర్ వ్యూలో నాగబాబు ఫైర్ అయ్యారు. ‘చిన్నప్పట్నుంచీ సొంత అన్నాచెల్లెళ్లులా పెరిగారు వాళ్లి్ద్దరూ. నిహారికను సాయిధరమ్ ఎత్తుకొని తిరిగేవాడు. ఏ దరిద్రుడో ఇది క్రియేట్ చేశాడు. ఇదొక ఫులిష్ న్యూస్. పనీపాటా లేనివాళ్లు సృష్టించిన ఇలాంటి వార్తలను నమ్మొద్దు’ అంటూ ఫైర్ అయ్యారు నాగబాబు.
‘జబర్దస్త్’పై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ‘సమాజాన్ని నిర్వీర్యం చేసేంత తప్పులేం జబర్దస్త్ లో జరగడం లేదు. అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ దట్సాల్’ అని తేల్చిచెప్పారు నాగబాబు.
వరుణ్ తేజ్ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాననీ.. నటుడ్ని అవుతానంటే ప్రోత్సహించాను కానీ... ఇంతమంచి హీరో అవుతాడని అనుకోలేదనీ.. ‘కంచె’ అతనికి మంచి పేరు తెస్తే.., ‘ఫిదా’ వరుణ్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిందనీ...నాగబాబు ఆనందం వెలిబుచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



