మహిళల్లో ఐరన్ లోపం తగ్గాలంటే.. తినాల్సిన ఫుడ్స్ తినాల్సిందే!
ఐరన్ శరీరానికి అవసరమైన పోషకాలలో ఒకటి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోని స్త్రీలు ఆరోగ్య పరంగా ప్రమాదానికి గురవుతారు. ముఖ్యంగా నెలసరి విషయాల్లోనూ, అధిక రక్తస్రావం వంటి కారణాల వల్లా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మహిళలు తమ ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మహిళలు ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుంటే..
షెల్పిష్..
షెల్ఫిష్ మాంసాహారానికి చెందినవి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు పోషకమైనవి కూడా. వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా క్లామ్స్, గుల్లలు, మస్సెల్స్ వంటి సముద్రపు ఆహారాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
బచ్చలికూర..
బచ్చలికూర తక్కువ కేలరీలు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్ సి శరీరంలోని ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యానికి మంచిది.
మాంసం..
మాంసం శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తీర్చగలదు. ఇందులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి, కాపర్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు, శనగలు, బఠానీలు, సోయాబీన్ వంటివి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 28 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.5 మి.గ్రా ఇనుము ఉంటుంది. ఇవి మాత్రమే కాదు గుమ్మడికాయ గింజలలో విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి.
*నిశ్శబ్ద.