పిల్లలు పుట్టడంలో ఇబ్బందులా? ఈ ఆహారాలు తీసుకుంటే సెట్..!

ఒకప్పటితో పోలిస్తే ఇప్పట్లో పిల్లలు పుట్టడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది. మగవారిలో కూడా ఈ లోపం ఉన్నప్పటికీ ఎక్కువశాతం ఆడవారిలో కనిపిస్తుంది. మహిళలల్లో గర్భాశయ సమస్యలు, నెలసరి సరిగా రాకపోవడం, హార్మోన్ సమస్యలు మొదలైనవి పిల్లలు పుట్టడంలో ఇబ్బందులకు కారణం అవుతాయి. అయితే పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం అని ఆహార నిపుణులు అంటున్నారు.  పిల్లలు పుట్టడంలో  లోపాలను, హార్మోన్ సమస్యలను అధిగమించడానికి  కొన్ని ఆహారాలు బాగా సహకరిస్తాయి. అవేంటో తెలుసుకుంటే..

ఫ్యాటీ ఫిష్..

చేపలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. రుతుచక్రాన్ని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.

ఆకుకూరలు..

పాలకూర, బచ్చలికూర, కాలే, తోటకూర మొదలైన ఆకుకూరలలో ఫోలెట్ అధికంగా ఉంటుంది. ఇది పిండం డవలప్ కావడానికి ఎంతో ముఖ్యమైనది. సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

బెర్రీస్..

బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ బారి నుండి అండాలను, స్పెర్మ్ ను రక్షించడంలో సహాయపడతాయి.

అవకాడో..

అవకాడో ఖరీదైన పండే అయినప్పటికీ వీటిలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా విటమిన్-ఇ, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి  సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.

సీడ్స్, నట్స్..

బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ మొదలైన వాటిలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం.

తృణధాన్యాలు..

క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అవసరమైన పోషకాలు అన్నీ తృణధాన్యాలలో లబిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

లీన్ ప్రోటీన్లు..

లీన్ మాంసాలు, పాలు పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు, చిక్కుళ్లు వంటివి తీసుకోవాలి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి, మొత్తం పునర్ఫత్తి ఆరోగ్యానకి కూడా చాలా మంచి ప్రోటీన్ ను అందిస్తాయి.

డైరీ ఆహారాలు..

పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సంతానోత్పత్తి ఆరోగ్యంలో సానుకూల ఫలితాలు ఇస్తాయి.

రంగురంగుల కూరగాయలు..

కేవలం సంతానోత్పత్తికే కాదు.. సాధారణంగా కూడా ఆరోగ్యం బాగుండాలంటే రంగు రంగుల కూరగాయలు తీసుకోవడం చాలా ముఖ్యం. బెల్ పెప్పర్స్, క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అండాలు, స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. దీని వల్ల సంతానోత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడతాయి.

                                      *నిశ్శబ్ద.