గర్భిణులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్..ఇదెలా ప్రభావం చూపిస్తుందంటే!
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్య. సాధారణంగా మహిళలలో ఈ సమస్య గర్భవతులలో వస్తుంది. ఇది ఒకరకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అంటే ఈ సమస్య చేతులు, మణికట్టు, మోచేతులు, మోకాళ్లు వంటి కీళ్ల భాగాల్లోనే కాకుండా శరీరంలో ఇతర కీళ్ల భాగాలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నయం చేయలేని జబ్బు అని అంటుంటారు. అయితే మధుమేహం, హైపోథైరాయిడిజం వంటి సమస్యల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా నియంత్రణ ద్వారా సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది గర్భవతులలో ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే..
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ల భాగంలో వచ్చే సమస్య. ఇది కీళ్ల భాగంలో వాపు, నొప్పి కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు శరీరంలో హార్మోన్స్ వాతావరణ శోథ నిరోధక స్థితికి దారితీస్తుంది. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మాత్రం దాన్నుంచి రిలీఫ్ ఫీలవుతారు. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు కారణమయ్యే కణాలు, శరీరంలో విడుదల అయ్యే సైటోకిన్ లు గర్భాధారణ సమయంలో అణిచివేయబడతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు గర్భధారణ సమయం ఆరోగ్యంగా గడవాలంటే మావి పనితీరు సమర్థవంతంగా ఉండాలి. ఈ సందర్భంలో తల్లి గర్భంలో ప్లాసెంటా అనే అవరోధం ఏర్పడుతుంది. ఇది తల్లిలో ఉన్న రక్తప్రసరణను కడుపులో పెరుగుతున్న బిడ్డకు కలుపుతుంది. దీనివల్ల తల్లి, బిడ్డలో కణాలు, అణువులు పరస్పరం మార్పిడి జరగడం, సంకర్షణ చెందడం జరుగుతుంది. దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలకు అవసరమైన పోషణ లభిస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న తల్లి రక్తంలో వివిధ రకాల ప్రతిరోధకాలు ఉంటాయి. ఇవి కేవలం తల్లి కీళ్ళను మాత్రమే కాకుండా రక్త నాళాలలో కూడా సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల ప్లాసెంటల్ రక్తనాళాలలో కణాలు, అణువులలో మార్పుల కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేని వారితో పోలిస్తే ఆరోగ్య పరంగా తేడాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న మహగిళలలో ప్రీఎంక్లంప్పియా, రక్తపోటు, ఆకస్మికంగా అబార్షన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలావరకు జన్యు కారకాలతో ముడిపడి ఉంటుంది. అయితే ఇది తల్లి నుండి బిడ్డకు మాత్రం రాదు. ఈ సమస్య ఉన్న తల్లులు రుమటాలజిస్ట్ సహాయంతో సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటే ఈ సమస్య ప్రభావం తక్కువగా ఉంటుంది.
*నిశ్శబ్ద.