Weight Gain During Pregnancy..  

Overweight And Obesity In Children..   మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా పిల్లల్లో ఒబెసిటి సమస్య ఎక్కువవుతుంది.. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికే ముప్పుగా మారి ప్రాణాల మీదకు వస్తోంది. మరి దీనిని ఎలా నియంత్రించాలి.. ఒబెసిటీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ జానకీ శ్రీనాధ్ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=6xcpYkxWxto  

పిల్లలకు ఫార్ములా ఫుడ్ పెడుతున్నారా..? జాగ్రత్త   పాలు తాగే వయసు నుంచి పెరిగి పెద్దవుతున్న మీ చిన్నారుల ఎదుగుదల కోసం ఆహారాన్ని పెడుతున్నారా.. వాళ్లు ఇష్టంగా తింటున్నారని సంబరపడిపోతున్నారా.? కానీ వారు తినే పదార్ధాల్లో విషం ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు.. అది ఎలా తెలుసుకోవాలో.. దీని నుంచి మీ కంటిపాపల్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి.   https://www.youtube.com/watch?v=4qUwMUnB3Fs  

Travel During Pregnancy...   గర్భం ధరించిన స్త్రీలు ప్రయాణం చేయాలంటే చాలా భయపడతారు. అలాంటి సమయంలో ప్రయాణం చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో అని ఆలోచిస్తారు. కానీ ప్రయాణం చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అసలు ప్రగెన్నీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలా ఉండాలి..? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=8YVnKPcdPJ4

పిల్లలో డయాబెటిస్ ఆహార నియమాలు..!   చిన్న పిల్లల్లో డయాబెటిస్ అనేది కొంచెం కష్టమయిన విషయమే. 15 ఏళ్ళ లోపు వారికి గనక డయాబెటిస్ వస్తే ఆహరం మరియు ఇతరత్రా విషయాల్లో చాలా జాగర్తలు తీసుకోవాల్సి వస్తుంది. డయాబెటిస్ వచ్చిన చాలా మంది పిల్లలకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పిల్లల్లో డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=lQHQS9OmgSk

టివీ ముందు పిల్లలు ఠీవీగా కూర్చుంటున్నారా? అయితే, డేంజరే!    

పిల్లలతో ఎలామాట్లాడాలి !!    

బేబీతో కనెక్ట్ అవ్వడం ఎలాగో మీకు తెలుసా! బేబీ తో కనెక్ట్ అవడం ఎలాగో తెలుసా? దీనిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? అదేనండి, ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వచ్చో తెలుసా? చాలా మంది అనుకోవడం ఏంటంటే వాళ్ళ బేబీ తో అనుబంధం పుట్టిన తర్వాత మొదలవుతుందని. కానీ, గర్భంలో ఉన్నప్పటి నుండే మీరు మీ బేబీ తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=DWP136bFcp4  

బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే..?   పుట్టబోయే బేబీ హెల్దీగా  ఉండాలి అంటే, ప్రెగ్నెన్సీ టైములో చాలా మానసికంగా, చాలా ఆరోగ్యముగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకి మెంటల్ హెల్త్ మరియు ఫిసికల్ హెల్త్ రెండూ ముఖ్యమే. సాధారణంగా అందరికి ఫిసికల్ హెల్త్ విషయంలో ఎలా జాగ్రత్త వహించాలి తెలుసు, కానీ మెంటల్ హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలియదు. ఈ విషయంలో క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=7XsfCkZhCeU

పిల్లలలో ఆహరనైపుణ్యం ఎలా పెంపొందించాలి..? పిల్లలకి ఆరోగ్యవంతమయిన ఆహారాన్ని ఎంచువడంలో నేర్పు ఎలా పెంపొందించాలి? సాధారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యవంతమయిన ఆహరం తీసుకోవడం అంతగా ఆసక్తి చూపించడం లేదు అని బాధపడుతుంటారు. అయితే, పిల్లల్లో ఆహార నైపుణ్యం ఎప్పటి నుండి పెంపొందించాలి. ఎలాంటి ఆహరం, ఏ వయసులో ఉన్నప్పటి నుండి ఇస్తే పిల్లల్లో ఆహార నైపుణ్యం పెరుగుతుంది, తదితర విషయాల్లో అవగాహన కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=cx-odGFMB9I    

మీ అబ్బాయి హీరోలా ఫీలవుతున్నాడా?!          * పేరెంట్స్ మీటింగ్ ఉంటే కొడుకు స్కూల్ కి వెళ్లి రజిత. అక్కడ కొడుకు క్లాస్ టీచర్ చెప్పిన విషయాలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రజితకి. ఎల్.కె.జి. చదువుతోన్న ఆమె కొడుకు విశాల్ క్లాసులో తెగ అల్లరి చేస్తున్నాడట. పక్కవాళ్లతో మాట్లాడుతూనే ఉంటాడట. స్లీపింగ్ పీరియడ్లో అస్సలు నిద్రపోడట. పైగా నిద్రపోయే ఇతర పిల్లల్ని లేపేస్తుంటాడట. ఇవి చాలామంది పిల్లలు చేస్తారు కాబట్టి నవ్వుకుంది రజిత. మెల్లగా నచ్చజెప్తాను అంది టీచర్ తో. అయితే టీచర్ చెప్పిన ఒక విషయం మాత్రం రజిత మతి పోగొట్టింది. విశాల్ ఒక హీరోలా ఫీలవుతుంటాడట.           * అందరి మీదా పెత్తనం చేయడం, తను చేయాలనుకున్నదే చేయడం, తను చెప్పిందే అందర్నీ చేయమనడం, చివరికి టీచర్ చెప్పినా మొండిపట్టు పట్టడం చేస్తుంటాడట. అంతకన్నా విచిత్రం ఏమిటంటే... ఏదైనా స్కిట్ కానీ, డ్రామా కానీ వేయాల్సి వస్తే, పవర్ ఫుల్ పాత్ర అయితేనే చేయడానికి ఇష్టపడతాడట. పులి, సింహం లాంటి వేషాలట. ఏ కోతి వేషమో, కుక్క వేషమో వేయమంటే వేయనంటాడట. రాజులా తప్ప సైనికుడిలా చేయనంటాడట. ఇదంత మంచి లక్షణం కాదు అంది టీచర్.    * బుర్ర తిరిగిపోయింది రజితకి. ఎందుకంటే పిల్లాడి వయసు ఎంతో లేదు. ఇంకా ప్రపంచం కూడా సరిగ్గా తెలియదు. మరి అప్పుడే ఇలాంటి ఆధిక్య ధోరణి ఎలా వచ్చిందో అర్థం కాలేదామెకి. ఆమెకే కాదు... చాలామందికి అర్థం కాదు. అలా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది పిల్లలు పెద్దయ్యాక పెత్తందారుల్లాగా వేధింపులకు సైతం దిగేవారులాగా తయారవుతారన్నది కాదనలేని నిజం. కాబట్టి ఆ తప్పు మీరు చేయకండి. మీ కొడుకు మీద ఓ కన్నేసి ఉంచండి.      * ఒకప్పుడు పిల్లలు తండ్రిని ఫాలో అయ్యేవారు. నాన్న ఏం చేస్తే అది చేయడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు టీవీల ప్రభావం ఎక్కువైంది. ఏ సినిమానో చూసినప్పుడు ఆ హీరో చెప్పింది అందరూ వినడం చూస్తారు. తన మాట కూడా అలా వినాలన్న భావన అప్పుడే మొదలవుతుంది. ఏ కార్టూన్ షోలోనో ఒక పిల్లాడు అందరినీ అదరగొట్టి బెదరగొట్టేస్తుంటాడు. దాంతో అలా చేస్తే తానూ హీరోనవుతాను అనుకుంటాడు. ఇలాంటివే పిల్లల మనసులో హీరోయిజాన్ని నిద్ర లేపుతుంటాయి.       * అంతేకాక ఇంట్లో వాతావరణం కూడా ఒక కారణం. కొందరి ఇళ్లలో మనం ఎక్కువ వాళ్లు తక్కువ అన్న భేషజాలు ఎక్కువగా ఉంటాయి. పనివాళ్లను, కూరగాయలవీ అమ్ముకునేవాళ్లను, వాచ్ మేన్ లాంటి వాళ్లను బలహీనులుగా చూస్తుంటారు. అది పిల్లలు కనుక గమనిస్తే వాళ్లలో తాము ఎక్కువ అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది. ఇతరుల్ని తక్కువగా చూడటం అలవాటవుతుంది. తద్వారా తానెప్పుడూ పై స్థాయిలోనే ఉండాలన్న పట్టుదల కూడా వస్తుంది. ఇక ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గడానికి ఇష్టపడరు. అది మాత్రమే కాదు.. టీవీలో చూసినట్టు రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు.       * ఇదంతా పదేళ్లో పదిహేనేళ్లో వచ్చాక మొదలవుతుందనుకుంటే పొరపాటు. ఊహ తెలిసినప్పటి నుంచి, మాట వచ్చినప్పట్నుంచి పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఆదిలోనే వాళ్లకి సరైన దారి చూపించాలి. హీరోలా ఉండటం మంచిదే కానీ హీరోయిజం పాజిటివ్ గా మాత్రమే ఉండాలన్న నిజాన్ని మెల్లమెల్లగా వాళ్లకి నేర్పండి. మొక్కై వంగనిది మానై వంగదని మర్చిపోకండి.  -Sameera

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే... ఇది తినాల్సిందే!     చాలామంది పిల్లలు ఎన్ని మందులు వాడినా, ఎంత ఆహారాన్ని తీసుకున్నా... వయసుకి తగినంత బరువు, ఎత్తు ఉండరు. ఈ తరహా సమస్యలని wasting (తక్కువ బరువు), stunting (తక్కువ ఎత్తు) అంటారు. ఇప్పుడు ఈ సమస్యకి సులువైన పరిష్కారం లభించిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరు నెలల పాటు, రోజుకో గుడ్డు చొప్పున పెడుతూ ఉంటే, వారిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని అంటున్నారు. గుడ్డులో ఉండే పోషకాహార విలువ గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కానీ ఇది పిల్లల బరువు, ఎత్తు విషయంలో ఏమేరకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందో చూడాలనుకున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఇందుకోసం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలోని కొందరు పిల్లలను ఎంచుకున్నారు. ఈ పిల్లలని రెండు బృందాలుగా విడదీశారు. మొదటి జట్టులో ఉన్నవారికి ఆర్నెళ్లపాట రోజూ గుడ్డు అందించారు. రెండో విభాగంలో పిల్లలకి గుడ్డు ఇవ్వలేదు. ఆర్నెళ్లు గడిచేసరికి పరిశోధకులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. రోజూ గుడ్డు తిన్న పిల్లలలో ఎత్తు పెరగకపోవడం అనే సమస్య 47 శాతం తగ్గిపోయింది. ఇక బరువు పెరగకపోవడం అనే సమస్య 74 శాతం తగ్గిపోయింది. అంతేకాదు! రోజూ గుడ్డు తినే పిల్లలకి తగినంత పోషకాహారం లభిస్తున్నట్లు తేలింది. బహుశా ఆకలి తీరడం వల్లనో ఏమో... వీరు చిరుతిళ్లు తినడం కూడా తగ్గిపోయిందట! ఈ పరిశోధనతో గుడ్డు వల్ల మరో ఉపయోగం కూడా రుజువైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు గుడ్డు తినడం వల్ల ఉండే మరికొన్ని ఉపయోగాలను ఓసారి గుర్తుచేసుకుందాం... - శాకాహారులు తినే ఆహారంలో B12 అనే పోషకపదార్థం ఉండదు. మాంసాహారం జోలికి పోకుండా ఈ B12ని అందించే సాధనం గుడ్డు మాత్రమే! ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలోనూ, నాడీ వ్యవస్థ పనితీరులోనూ B12 అత్యవసరం. - గుడ్డులో సెలీనియం అనే అరుదైన పదార్థం ఉంటుందనీ, దీంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ చెబుతున్నారు. - మన శరీరానికి చాలా అవసరం అయినా విటమిన్ డి ఎక్కువగా సూర్యకాంతి నుంచే లభిస్తుంది. కానీ ఇప్పటి పిల్లలు ఎండ అనేదే ఎరుగకుండా పెరుగుతున్నారు కదా! గుడ్డు కనుక తింటే, వారికి కావల్సినంత విటమిన్ డి దొరుకుతుంది. - ఇప్పటి పిల్లలలో కంటి సమస్యలు చాలా సాధారణం అయిపోతున్నాయి. కానీ గుడ్డులో ఉండే Lutein, Zeaxanthin అనే పదార్థాలు కంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి. - పిల్లలు పాపం బోల్డు పుస్తకాలని బట్టీపట్టాల్సి ఉంటుంది. మరి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం అని వినే ఉంటారు. ఆ ఒమేగా- 3 గుడ్డులో సమృద్ధిగా లభిస్తుందట. చివరగా... గుడ్డులో ప్రొటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతారు. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఈ ప్రొటీన్లు చాలా అవసరం. మరెందుకాలస్యం! అశ్రద్ధ చేయకుండా మీ ఇంట్లో పిల్లలకి రోజుకి ఓ గుడ్డు తినిపించండి. పనిలో పనిగా మీరు కూడా ఒకటి లాగించేయండి. - నిర్జర.    

ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలకి డిప్రెషన్‌ కూడా వస్తుంది!   ఫుడ్‌ అలెర్జీ- ఈ మాట గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. వేరుశనగపప్పు, పాలు, గోధుమలు... ఆఖరికి బియ్యం దాకా కొన్ని ఆహారపదార్థాలు సరిపడకపోవడాన్నే ఫుడ్‌ అలెర్జీగా పేర్కొంటాం. ఈ అలెర్జీ కలిగించే ఆహారాన్ని తీసుకోగానే శరీరం మీద దద్దుర్లు దగ్గర్నుంచీ విరేచనాలా దాకా చాలా సమస్యలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఫుడ్‌ అలెర్జీ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలెర్జీ బారిన పడ్డ పిల్లల్లో మానసిక సమస్యలు కూడా ఏమన్నా వస్తాయేమో చూడాలనుకున్నారు పరిశోధకులు. అందుకోసం ఓ 80 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 4 నుంచి 12 ఏళ్ల వయసు లోపువారే! వీరిలో కొందరు పిల్లలకి ఫుడ్ అలెర్జీ ఉంటే మరికొందరికి ఆ సమస్యే లేదు! ఈ 80 మంది పిల్లల్లోనూ డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు ఎవరిలో ఉన్నాయో గమనించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలలో డిప్రెషన్ వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫుడ్‌ అలెర్జీతో బాధపడే పిల్లలలో దాదాపు 60 శాతం మందిలో డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనతో డిప్రెషన్‌కు, ఫుడ్‌ అలెర్జీకీ సంబంధం స్పష్టమైపోయింది. దాంతో ఈ సంబంధానికి వెనుక కారణాలను కూడా వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు. అలెర్జీని మన శరీరం ఒక ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. అది ఒక తెలియని ఉద్వేగంగా మారే ప్రమాదం ఉంది. పైగా అలెర్జీ ఉన్న పిల్లలకి, తాము ఇతరులకంటే భిన్నం అన్న అభిప్రాయం కలుగుతుంది. తమ తోటి పిల్లలతో పోలిస్తే తమలో ఏదో లోపం ఉందన్న న్యూనత ఏర్పడుతుంది. అది క్రమేపీ డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఫుడ్ అలెర్జీ వచ్చిన వెంటనే కంగారుపడి వైద్యం కోసం పరుగులుతీసేకంటే... అది రాకుండా జాగ్రత్తపడటమే మేలంటున్నారు శాస్త్రవేత్తలు. తమ పిల్లలలో ఎలాంటి ఆహారం అలెర్జీని కలిగిస్తుందో కనిపెట్టి, ఆ పదార్థాన్ని వారికి దూరంగా ఉంచమంటున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ ఫుడ్‌ అలెర్జీల మీద అవగాహన తక్కువ. పైగా పిల్లలకు సరిపడే ఆహారాన్ని కొనలేని దుస్థితి. ఒకవేళ పిల్లవాడికి తేడా చేస్తే వైద్యం చేయించలేని దైన్యం. కాబట్టి బడిలో కూడా పిల్లలకి ఫుడ్‌ అలెర్జీల మీదా, దాని నుంచి తప్పించుకునే అవకాశాల మీద తగిన అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. దాంతో పిల్లవాడి శరీరమూ, మనసు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.   - నిర్జర.

నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?’ అని ఏ పిల్లవాడినైనా కదిపి చూడండి! ‘చాక్లెట్లు, కేకులు, ఐస్క్రీం, కోక్, పిజ్జా.....’ అంటూ మన మెదడు మొద్దుబారిపోయేలా చాంతాడంత జాబితా చెబుతారు. ఎప్పుడో అడపాదడపా ఇలాంటి చిరుతిళ్ల మీద మనసు పారేసుకోవడం తప్పుకాదు. కానీ ఇవి లేనిదే రోజు గడవని పరిస్థితి వస్తే మాత్రం నష్టపోయేది పిల్లలే! ఆ మాట వారికి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు.  పిల్లలకీ, చిరుతిళ్లకీ ఉన్న అవినాభావ సంబంధం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇంగ్లండులోని పిల్లలు కూడా పళ్లు, కూరగాయలు పూర్తిగా పక్కనపెట్టేసి చిరుతిళ్ల మీద పడుతున్నారట. తినాల్సిన మోతాదుకంటే మూడురెట్లు ఎక్కువ తీపిని లాగించేస్తున్నారట. వీటితో ఊబకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఇంగ్లండులోని Exeter అనే విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు దీనికి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. ఒక కంప్యూటర్ గేమ్ని రూపొందించి పిల్లల మీద ప్రయోగించారు. చాక్లెట్లాంటి పదార్థాలు ఒక రకమైన వ్యసనాన్ని కలగచేస్తాయి. అందుకనే వీటిని చూడగానే... మెదడు ‘కొనేసెయ్, తినేసెయ్’ అంటూ రెచ్చగొడుతుంది. స్వీయనియంత్రణ (self- control) కోల్పోతారు. ఒక చిన్న గేమ్ ద్వారా ఈ స్వభావాన్ని మార్చాలనుకున్నారు సైకాలజిస్టులు. ఈ ఆటలో పిల్లవాడికి కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకో ఆహారపదార్థమూ కనిపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిదైతే దాని పక్కన సంతోషంగా ఉండే బొమ్మ కనిపిస్తుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాకపోతే విషాదంగా ఉన్న మొహం కనిపిస్తుంది. సంతోషకరమైన మొహాన్ని చూసినప్పుడు పిల్లలు బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆట ముగిసిన తర్వాత పిల్లల్ని వాళ్లకి కావల్సిన ఆహారపదార్థాలు కొనుక్కోమన్నారు. ఆశ్చర్యంగా పిల్లలు ఇదివరకులా కాకుండా మంచి ఆహారం వైపు ఎక్కువగా మొగ్గుచూపారట. అంటే వారు ఆడిన ఆట మెదడు మీద తెలియకుండానే సానుకూల ప్రభావం చూపిందన్నమాట. ఇదే మార్పుని పాఠాల ద్వారా, సెమినార్ల ద్వారా తీసుకురావాలంటే బోలెడు ఖర్చు, సమయం వృధా అవుతాయి. కానీ ఏడంటే ఏడు నిమిషాలలో ముగిసిపోయిన ఆటతో వారిలో అనూహ్యమైన మార్పుని సాధించారు పరిశోధకులు. ఈ ప్రయోగం కోసం 4 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న 200 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరందరి మీదా ఆట ఒకే తీరున ప్రభావం చూపిందట. అంటే ఇలాంటి వీడియో గేమ్స్తో చిన్నా, పెద్దా... ఎవరి మీదైనా సానుకూల ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆలోచనతో Dr Natalia Lawrence అనే శాస్త్రవేత్త పెద్దలలో చిరుతిళ్ల అలవాట్లు మార్చేందుకు, Food Trainer అనే యాప్ను రూపొందించారు. కావాలంటే గూగుల్ ప్లేలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడండి.

  తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా!     తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. పోలికలూ దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తోంది. తల్లి అనురాగాన్ని పొందే పిల్లల మెదడులో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కొందరు పరిశోధకులు నిరూపించారు. పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు ఓ 92 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల వయసులోపువారే! ప్రయోగంలో భాగంగా పిల్లవాడిని తల్లితో పాటు ఐదు నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో ఏదో ఫారం పూర్తిచేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందర ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి ఫారంని పూర్తిచేసేవారకూ కూడా పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు. సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు. ఆ సమయంలో తల్లి ఒక పక్క ఫారంని పూర్తిచేస్తూనే తన కొడుకుని ఏ విధంగా సముదాయించాల్సి వచ్చేది. ఈ సమయంలో వారిని గమనించేందుకు కొందరు సైకాలజిస్టులను నియమించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తోందో చూసి, దాని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు. ఓ నాలుగేళ్లు గడచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్కు తీసుకువచ్చారు పరిశోధకులు. అక్కడ MRI స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు. ప్రేమగా చేసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిప్పోకేంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లలకంటే వీరి హిప్పోకేంపస్ ఏకంగా పదిశాతం ఎక్కువగా ఎదిగింది. తల్లిప్రేమ పొందిన పిల్లలలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది. మనలో నేర్పు, జ్ఞాపకశక్తి, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలన్నింటినీ హిప్పోకేంపస్ నియంత్రించగలదు. ఈ హిప్పోకేంపస్ బాగుంటే మనిషి అద్భుతాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటాడన్న మాట! మరి ఆ అద్భుతాల వెనుక తల్లి ప్రేమ దాగుందన్న విషయం తేలిపోయిందిగా!

  ఒబెసిటీ ఉన్న పిల్లల్ని డీల్ చేయడమెలా?!     ఒబెసిటీ... పెద్దవాళ్లనే కాదు, పిల్లలనీ వేధిస్తోన్న సమస్య. భారీగా పెరిగిన శరీరం పెద్దలను ఎంత ఇబ్బంది పెడుతుందో పిల్లలను అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అందరూ తమని అదోలా చూడటం, నవ్వడం చేస్తున్నారని పిల్లలు బాధపడే అవకాశం ఉంది. కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. వాళ్లను డీల్ చేయడం తల్లులు నేర్చుకోవాలి. - తల్లిదండ్రులు సాధారణంగా చేసే తప్పు పిల్లలను ఇతరులతో పోల్చడం. అది వాళ్ల మనసును ఎంతగా గాయపరుస్తుందో ఊహించలేం. ముఖ్యంగా తమలో లోపం ఉందని ఫీలయ్యే పిల్లలైతే కుంగిపోతారు. అందుకే ఆ బాబు చూడు ఎలా ఉన్నాడో, ఈ పాప చూడు ఎలా ఉందో, నువ్వూ అలానే ఉండాలి అన్నమాట నోటి నుంచి రానివ్వకండి. - అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములతో కూడా పోల్చకూడదు. పిల్లలు మామూలుగానే వాళ్లతో పోల్చుకుని ఫీలవుతుంటారు. మనమూ అదే పని చేస్తే వాళ్ల ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది. ఇన్ ఫీరియర్ గా తయారవుతారు. అలాగే... నీ వయసులో నేనలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటూ కూడా చెప్పకూడదు. - తిండి విషయంలో రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఇది తింటే ఇంకా లావైపోతావ్ అన్న మాట అస్సలు అనకూడదు. దానికి బదులు వాళ్లకి కూల్ గా ఎక్స్ ప్లెయిన్ చేయండి. ఇది ఆరోగ్యానికి ఇలా చేటు చేస్తుంది, భవిష్యత్తులో ఫలానా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి దీని బదులు ఇది తింటే చాలా మంచిది అని చెప్పండి. అయినా వాళ్లు బాధపడుతున్నారు అనుకుంటే అలాంటి ఫుడ్ ని ఇంట్లోకి అసలు రానివ్వకండి. పిల్లల సంతోషం కంటే కావలసింది ఏముంది! - ఒక దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు కానీ ఒక మాట అంటే పడలేం అంటారు కదా. పిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువ. వాళ్లు మాటల్నే ఎక్కువ గుర్తు పెట్టుకుని బాధపడతారు. కాబట్టి ఆరోగ్యం గురించి, శరీరం గురించి లెక్చర్లు ఇవ్వకండి. క్లాసులు పీకకండి.     - డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడొద్దు. ఈ డ్రెస్ నీకు బాగోదు, నీకు సూట్ కాదు, నీకంటే అక్కకి/అన్నకి బాగుంటుంది నువ్వు వేరేది తీసుకో.. ఇలాంటివి అనడం చాలా తప్పు. - శరీరాన్ని బట్టి ముద్దుపేర్లు పెట్టొద్దు. మీరు ముద్దుగా లడ్డూ అని పిలిచినా వాళ్లను కామెంట్ చేస్తున్నారేమో అనుకునే ప్రమాదం ఉంది. బయట కూడా ఎవర్నీ నిక్ నేమ్స్ పెట్టి పిలవనివ్వకండి. - వ్యాయామం విషయంలో ఒత్తిడి చేయవద్దు. ఇలా చేస్తే సన్నబడతావ్ అంటూ అదీ ఇదీ చేయమని విసిగించకండి. తాము అలా ఉండటం అమ్మానాన్నలకు నచ్చడం లేదు అన్న ఫీలింగ్ వచ్చి తమ మీద తమకే అయిష్టత ఏర్పడుతుంది. - పొరపాటున వాళ్లు దిగులుగా కనిపిస్తే... ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. బయట ఎవరైనా కామెంట్ చేస్తున్నా, స్కూల్లో తోటి పిల్లలు ఏడిపిస్తున్నా వెంటనే వెళ్లి వాళ్లతో మాట్లాడండి. వాళ్లే సర్దుకుపోతారులే అనుకుంటే మీ పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒబెసిటీ అనేది ఓ సమస్య. అది లోపం కాదు. ఆ విషయం తెలియక బాధపడే చిన్నారుల్ని ఆ బాధ నుంచి బయట పడేయాలంటే ఈమాత్రం జాగ్రత్త తీసుకోక తప్పదు. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. కాదంటారా?! - Sameera

  బడి మీద భయం... మీరే చేయాలి దూరం!   స్కూళ్లు తెరుచుకున్నాయి. చిన్నారుల ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. పొద్దున్నే లేచి, స్నానాలు చేసి, పుస్తకాల సంచీలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు పిల్లలు. అయితే ఆల్రెడీ స్కూల్ అలవాటైపోయిన వాళ్లకి ఫర్వాలేదు. కానీ మొదటిసారి బడికి వెళ్తున్న పిల్లలతో మాత్రం పెద్ద తంటానే. నాలుగేళ్లు ఆడుతూ పాడుతూ గడిపేసిన వాళ్లకి... ఇప్పుడు సడెన్ గా ఓ కొత్త ప్రదేశానికి వెళ్లి, కొత్త మనుషుల మధ్య రోజంతా గడపడం అస్సలు నచ్చదు. దాంతో బెదిరిపోతారు. బడికి వెళ్లనంటూ మారాం చేస్తారు. కొంత మంది పిల్లలైతే నెలలు గడుస్తున్నా ఏడుస్తూనే ఉంటారు. అలా కాకుండా వాళ్లు ఆనందంగా బడికి వెళ్లేలా చేయాలి. అది కచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. - రోజూ స్కూల్ నుంచి వచ్చాక స్కూల్ ఎలా ఉంది అని అడగాలి. వాళ్లు బాలేదు అంటే ఏం బాలేదు అని అడగండి. అప్పుడు వాళ్లకు నచ్చని వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడండి. దాంతో వాళ్లలో మార్పు వస్తుంది. - పిల్లలకు టీచర్ అంటే చాలా భయమేస్తుంది. కాబట్టి ముందు టీచర్ ని ఇష్టపడేలా చేయాలి. అమ్మ, నాన్న ఏం కావాలన్నా టీచర్ నే అడగాలని, టీచర్ కూడా మమ్మీ డాడీల్లాగే చూసుకుంటుందని చెప్పాలి. - స్కూల్ కి తీసుకెళ్లినప్పుడు కొన్ని రోజులపాటు మీరు లోపలకు వెళ్లి టీచర్ తో కలివిడిగా మాట్లాడండి. అది చూస్తే తను కూడా మన మనిషే అన్న నమ్మకం కలుగుతుంది. - స్కూల్లో మీ పాప/బాబు పక్కన కూర్చునే వాళ్లతో కూడా మాట్లాడండి. అది చూసి పిల్లలు కూడా వాళ్లతో చనువుగా మాట్లాడతారు. కలిసిపోతారు. - ఇక పొద్దున్నే లేవడం కూడా పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. బడి మీద భయంతో అస్సలు లేవరు. లేచినా స్నానం చేయనంటారు. టిఫిన్ తిననంటారు. రకరకాల సాకులు చెబుతారు. ఎంత త్వరగా స్కూల్ కి వెళ్తే అంత త్వరగా ఇంటికి వచ్చేయవచ్చని చెప్పండి. రోజూ సాయంత్రం వచ్చాక తను ఎంజాయ్ చేసేది ఏదో ఒకటి రెడీగా ఉంటుందని చెప్పండి. తనకిష్టమైన ఫుడ్ ఐటమ్ చేస్తాననో, ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్తాననో ఏదో ఒకటి. దాంతో హుషారుగా వెళ్తారు. అందరు పిల్లల విషయంలోనూ ఇంత కష్టపడక్కర్లేదు. స్కూల్ అనగానే భయపడిపోయి ఎంతకీ అలవాటు పడని పిల్లల విషయంలో ఈమాత్రం కష్టపడక తప్పదు. ఒక్కసారి అలవాటు పడితే వాళ్లకీ ఇబ్బంది ఉండదు... మీకూ ఉండదు. - Sameera  

  పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు!     ‘ఐదేళ్ల చిన్నారి మీద అత్యాచారం’, ‘హాస్టల్‌ పిల్లల మీద వార్డెన్ అఘాయిత్యం’, ’పసికందు మీద 65 ఏళ్ల వృద్ధుని దాష్టీకం’.... ఇలాంటి వార్తలు నిరంతరం చదువుతూనే ఉంటాం. ఎక్కడో ఎవరికో జరిగింది కదా అనుకుని పెద్దగా పట్టించుకోం. కానీ నిజంగానే రోజులు బాగోలేవు! ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు కూడా లేనిపోని ప్రమాదాల బారిన పడే పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అదృష్టవశాత్తూ... చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు.   ఏది తప్పు – ఏది ఒప్పు అభంశుభం ఎరుగని పిల్లలకు వారి శరీరం గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి వారికి చెప్పే సందర్భమూ, చెప్పినా అర్థం చేసుకునే వయసూ కాదు. కానీ వారి శరీరంలోని భాగాల గురించి స్పష్టంగా చెప్పితీరాలని సూచిస్తున్నారు. అంతేకాదు! ఫలానా భాగాన్ని ఇతరులు ముట్టుకోవచ్చు, ఫలానా భాగాలను ఇతరులు ముట్టుకోకూడదు అంటూ నేర్పుగా సూచించాల్సి ఉంటుంది.   అయినవారే! ఒక సర్వే ప్రకారం దాదాపు 90 శాతానికి పైగా లైంగిక చర్యలు... తెలిసినవారి నుంచే ఎదురవుతున్నాయని తేలింది. అందుకని పిల్లలు ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఎవరితో మెలుగుతున్నారు, అవతలి వ్యక్తి స్వభావం ఎలా ఉంది అని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు వారి మానాన వారు తిరుగుతున్నారు కదా అని వదిలేస్తే, వారు సాఫ్ట్‌ టార్గెట్స్‌గా మారిపోతారు.   మగపిల్లలు కూడా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలు లైంగిక వేధింపులకి గురయ్యే అవకాశం తక్కువే! అలాగని వారు సురక్షితం మాత్రం కాదు. ప్రతి ఐదుగురు మగపిల్లల్లో ఒకరు, 18వ ఏట వచ్చేసరికి అత్యాచారానికి గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి వారి విషయంలోనూ తగినన్ని శ్రద్ధ తీసుకోవాల్సిందే!   బడిలో కూడా పిల్లలు ఇంటి తర్వాత బడిలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో టీచర్లో, పెద్ద తరగతి పిల్లలో హద్దు మీరే ప్రమాదం లేకపోలేదు. సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే భయంతో పాఠశాల యాజమాన్యం కూడా ఇలాంటి సంఘటనలను కప్పిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. అందుకని బడిని ఎంచుకునే సమయంలోనే, అక్కడ చదువు, ఆటపాటలతో పాటుగా క్రమశిక్షణ తీరుని గమనించాలి. కేవలం బడి మాత్రమే కాదు- ట్యూషన్‌ సెంటర్, కేర్‌ సెంటర్‌... ఇలా పిల్లల్ని భరోసాగా వదలిపెట్టే ప్రతి చోటా, అక్కడి వ్యక్తులు సరైనవారే అన్న అంచనాకు వచ్చితీరాలి.   చేతలే కాదు- మాటలు కూడా Sexual Abuse అనేది కేవలం చేతల్లోనే కాదు, మాటల ద్వారా కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకని మీముందు పిల్లలతో ఎవరన్నా తేడాపాడాగా మాట్లాడుతుంటే వెంటనే ఖండించండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఫలానా మాట సభ్యత కాదు అని పిల్లలు తెలుసుకుంటారు. ఎవరన్నా పిల్లలతో అలాంటి ‘బూతులు’ మాట్లాడుతున్నట్లు మీ దృష్టికి వస్తే జాగ్రత్తపడండి.   పిల్లవాడిలో మార్పు పిల్లవాడి రోజువారీ అలవాట్లలో కానీ, అతని స్వభావంలో కానీ అనూహ్యమైన మార్పు వస్తే... దానికి కారణం గుర్తించే ప్రయత్నం చేయండి. బడికి వెళ్లడానికి భయపడటం, ఎవరినన్నా చూసి వణికిపోవడం, మర్మాంగాల దగ్గర నొప్పిగా ఉందని చెప్పడం, ఎవరినీ దగ్గరకు రానీయకపోవడం, దిగాలుగా కూర్చోవడం... లాంటి లక్షణాలన్నీ పిల్లవాడు ఏదో సమస్యతో బాధపడుతున్నాడని చెప్పకనే చెబుతాయి. ఇలాంటి సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, పిల్లవాడితో నేర్పుగా మాట్లాడి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి.   ఈ జాగ్రత్తలన్నీ మనకి తెలియవని కావు. కాకపోతే ఏం జరగదులే అన్న ధీమాతో వాటిని అంతగా పాటించము. కానీ అదృష్టంలాగానే దురదృష్టం కూడా ఎవరినైనా వరించవచ్చు. కాబట్టి పిల్లలకు ఇలాంటి విషయాల మీద కాస్త అవగాహన ఏర్పడేవరకూ కంటికి రెప్పలా చూసుకోక తప్పదు. - నిర్జర.