ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలకి డిప్రెషన్‌ కూడా వస్తుంది!   ఫుడ్‌ అలెర్జీ- ఈ మాట గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. వేరుశనగపప్పు, పాలు, గోధుమలు... ఆఖరికి బియ్యం దాకా కొన్ని ఆహారపదార్థాలు సరిపడకపోవడాన్నే ఫుడ్‌ అలెర్జీగా పేర్కొంటాం. ఈ అలెర్జీ కలిగించే ఆహారాన్ని తీసుకోగానే శరీరం మీద దద్దుర్లు దగ్గర్నుంచీ విరేచనాలా దాకా చాలా సమస్యలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఫుడ్‌ అలెర్జీ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలెర్జీ బారిన పడ్డ పిల్లల్లో మానసిక సమస్యలు కూడా ఏమన్నా వస్తాయేమో చూడాలనుకున్నారు పరిశోధకులు. అందుకోసం ఓ 80 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 4 నుంచి 12 ఏళ్ల వయసు లోపువారే! వీరిలో కొందరు పిల్లలకి ఫుడ్ అలెర్జీ ఉంటే మరికొందరికి ఆ సమస్యే లేదు! ఈ 80 మంది పిల్లల్లోనూ డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు ఎవరిలో ఉన్నాయో గమనించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలలో డిప్రెషన్ వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫుడ్‌ అలెర్జీతో బాధపడే పిల్లలలో దాదాపు 60 శాతం మందిలో డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనతో డిప్రెషన్‌కు, ఫుడ్‌ అలెర్జీకీ సంబంధం స్పష్టమైపోయింది. దాంతో ఈ సంబంధానికి వెనుక కారణాలను కూడా వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు. అలెర్జీని మన శరీరం ఒక ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. అది ఒక తెలియని ఉద్వేగంగా మారే ప్రమాదం ఉంది. పైగా అలెర్జీ ఉన్న పిల్లలకి, తాము ఇతరులకంటే భిన్నం అన్న అభిప్రాయం కలుగుతుంది. తమ తోటి పిల్లలతో పోలిస్తే తమలో ఏదో లోపం ఉందన్న న్యూనత ఏర్పడుతుంది. అది క్రమేపీ డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఫుడ్ అలెర్జీ వచ్చిన వెంటనే కంగారుపడి వైద్యం కోసం పరుగులుతీసేకంటే... అది రాకుండా జాగ్రత్తపడటమే మేలంటున్నారు శాస్త్రవేత్తలు. తమ పిల్లలలో ఎలాంటి ఆహారం అలెర్జీని కలిగిస్తుందో కనిపెట్టి, ఆ పదార్థాన్ని వారికి దూరంగా ఉంచమంటున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ ఫుడ్‌ అలెర్జీల మీద అవగాహన తక్కువ. పైగా పిల్లలకు సరిపడే ఆహారాన్ని కొనలేని దుస్థితి. ఒకవేళ పిల్లవాడికి తేడా చేస్తే వైద్యం చేయించలేని దైన్యం. కాబట్టి బడిలో కూడా పిల్లలకి ఫుడ్‌ అలెర్జీల మీదా, దాని నుంచి తప్పించుకునే అవకాశాల మీద తగిన అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. దాంతో పిల్లవాడి శరీరమూ, మనసు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.   - నిర్జర.

నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?’ అని ఏ పిల్లవాడినైనా కదిపి చూడండి! ‘చాక్లెట్లు, కేకులు, ఐస్క్రీం, కోక్, పిజ్జా.....’ అంటూ మన మెదడు మొద్దుబారిపోయేలా చాంతాడంత జాబితా చెబుతారు. ఎప్పుడో అడపాదడపా ఇలాంటి చిరుతిళ్ల మీద మనసు పారేసుకోవడం తప్పుకాదు. కానీ ఇవి లేనిదే రోజు గడవని పరిస్థితి వస్తే మాత్రం నష్టపోయేది పిల్లలే! ఆ మాట వారికి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు.  పిల్లలకీ, చిరుతిళ్లకీ ఉన్న అవినాభావ సంబంధం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇంగ్లండులోని పిల్లలు కూడా పళ్లు, కూరగాయలు పూర్తిగా పక్కనపెట్టేసి చిరుతిళ్ల మీద పడుతున్నారట. తినాల్సిన మోతాదుకంటే మూడురెట్లు ఎక్కువ తీపిని లాగించేస్తున్నారట. వీటితో ఊబకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఇంగ్లండులోని Exeter అనే విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు దీనికి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. ఒక కంప్యూటర్ గేమ్ని రూపొందించి పిల్లల మీద ప్రయోగించారు. చాక్లెట్లాంటి పదార్థాలు ఒక రకమైన వ్యసనాన్ని కలగచేస్తాయి. అందుకనే వీటిని చూడగానే... మెదడు ‘కొనేసెయ్, తినేసెయ్’ అంటూ రెచ్చగొడుతుంది. స్వీయనియంత్రణ (self- control) కోల్పోతారు. ఒక చిన్న గేమ్ ద్వారా ఈ స్వభావాన్ని మార్చాలనుకున్నారు సైకాలజిస్టులు. ఈ ఆటలో పిల్లవాడికి కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకో ఆహారపదార్థమూ కనిపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిదైతే దాని పక్కన సంతోషంగా ఉండే బొమ్మ కనిపిస్తుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాకపోతే విషాదంగా ఉన్న మొహం కనిపిస్తుంది. సంతోషకరమైన మొహాన్ని చూసినప్పుడు పిల్లలు బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆట ముగిసిన తర్వాత పిల్లల్ని వాళ్లకి కావల్సిన ఆహారపదార్థాలు కొనుక్కోమన్నారు. ఆశ్చర్యంగా పిల్లలు ఇదివరకులా కాకుండా మంచి ఆహారం వైపు ఎక్కువగా మొగ్గుచూపారట. అంటే వారు ఆడిన ఆట మెదడు మీద తెలియకుండానే సానుకూల ప్రభావం చూపిందన్నమాట. ఇదే మార్పుని పాఠాల ద్వారా, సెమినార్ల ద్వారా తీసుకురావాలంటే బోలెడు ఖర్చు, సమయం వృధా అవుతాయి. కానీ ఏడంటే ఏడు నిమిషాలలో ముగిసిపోయిన ఆటతో వారిలో అనూహ్యమైన మార్పుని సాధించారు పరిశోధకులు. ఈ ప్రయోగం కోసం 4 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న 200 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరందరి మీదా ఆట ఒకే తీరున ప్రభావం చూపిందట. అంటే ఇలాంటి వీడియో గేమ్స్తో చిన్నా, పెద్దా... ఎవరి మీదైనా సానుకూల ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆలోచనతో Dr Natalia Lawrence అనే శాస్త్రవేత్త పెద్దలలో చిరుతిళ్ల అలవాట్లు మార్చేందుకు, Food Trainer అనే యాప్ను రూపొందించారు. కావాలంటే గూగుల్ ప్లేలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడండి.

  తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా!     తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. పోలికలూ దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తోంది. తల్లి అనురాగాన్ని పొందే పిల్లల మెదడులో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కొందరు పరిశోధకులు నిరూపించారు. పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు ఓ 92 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల వయసులోపువారే! ప్రయోగంలో భాగంగా పిల్లవాడిని తల్లితో పాటు ఐదు నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో ఏదో ఫారం పూర్తిచేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందర ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి ఫారంని పూర్తిచేసేవారకూ కూడా పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు. సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు. ఆ సమయంలో తల్లి ఒక పక్క ఫారంని పూర్తిచేస్తూనే తన కొడుకుని ఏ విధంగా సముదాయించాల్సి వచ్చేది. ఈ సమయంలో వారిని గమనించేందుకు కొందరు సైకాలజిస్టులను నియమించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తోందో చూసి, దాని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు. ఓ నాలుగేళ్లు గడచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్కు తీసుకువచ్చారు పరిశోధకులు. అక్కడ MRI స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు. ప్రేమగా చేసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిప్పోకేంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లలకంటే వీరి హిప్పోకేంపస్ ఏకంగా పదిశాతం ఎక్కువగా ఎదిగింది. తల్లిప్రేమ పొందిన పిల్లలలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది. మనలో నేర్పు, జ్ఞాపకశక్తి, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలన్నింటినీ హిప్పోకేంపస్ నియంత్రించగలదు. ఈ హిప్పోకేంపస్ బాగుంటే మనిషి అద్భుతాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటాడన్న మాట! మరి ఆ అద్భుతాల వెనుక తల్లి ప్రేమ దాగుందన్న విషయం తేలిపోయిందిగా!

  ఒబెసిటీ ఉన్న పిల్లల్ని డీల్ చేయడమెలా?!     ఒబెసిటీ... పెద్దవాళ్లనే కాదు, పిల్లలనీ వేధిస్తోన్న సమస్య. భారీగా పెరిగిన శరీరం పెద్దలను ఎంత ఇబ్బంది పెడుతుందో పిల్లలను అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అందరూ తమని అదోలా చూడటం, నవ్వడం చేస్తున్నారని పిల్లలు బాధపడే అవకాశం ఉంది. కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. వాళ్లను డీల్ చేయడం తల్లులు నేర్చుకోవాలి. - తల్లిదండ్రులు సాధారణంగా చేసే తప్పు పిల్లలను ఇతరులతో పోల్చడం. అది వాళ్ల మనసును ఎంతగా గాయపరుస్తుందో ఊహించలేం. ముఖ్యంగా తమలో లోపం ఉందని ఫీలయ్యే పిల్లలైతే కుంగిపోతారు. అందుకే ఆ బాబు చూడు ఎలా ఉన్నాడో, ఈ పాప చూడు ఎలా ఉందో, నువ్వూ అలానే ఉండాలి అన్నమాట నోటి నుంచి రానివ్వకండి. - అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములతో కూడా పోల్చకూడదు. పిల్లలు మామూలుగానే వాళ్లతో పోల్చుకుని ఫీలవుతుంటారు. మనమూ అదే పని చేస్తే వాళ్ల ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది. ఇన్ ఫీరియర్ గా తయారవుతారు. అలాగే... నీ వయసులో నేనలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటూ కూడా చెప్పకూడదు. - తిండి విషయంలో రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఇది తింటే ఇంకా లావైపోతావ్ అన్న మాట అస్సలు అనకూడదు. దానికి బదులు వాళ్లకి కూల్ గా ఎక్స్ ప్లెయిన్ చేయండి. ఇది ఆరోగ్యానికి ఇలా చేటు చేస్తుంది, భవిష్యత్తులో ఫలానా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి దీని బదులు ఇది తింటే చాలా మంచిది అని చెప్పండి. అయినా వాళ్లు బాధపడుతున్నారు అనుకుంటే అలాంటి ఫుడ్ ని ఇంట్లోకి అసలు రానివ్వకండి. పిల్లల సంతోషం కంటే కావలసింది ఏముంది! - ఒక దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు కానీ ఒక మాట అంటే పడలేం అంటారు కదా. పిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువ. వాళ్లు మాటల్నే ఎక్కువ గుర్తు పెట్టుకుని బాధపడతారు. కాబట్టి ఆరోగ్యం గురించి, శరీరం గురించి లెక్చర్లు ఇవ్వకండి. క్లాసులు పీకకండి.     - డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడొద్దు. ఈ డ్రెస్ నీకు బాగోదు, నీకు సూట్ కాదు, నీకంటే అక్కకి/అన్నకి బాగుంటుంది నువ్వు వేరేది తీసుకో.. ఇలాంటివి అనడం చాలా తప్పు. - శరీరాన్ని బట్టి ముద్దుపేర్లు పెట్టొద్దు. మీరు ముద్దుగా లడ్డూ అని పిలిచినా వాళ్లను కామెంట్ చేస్తున్నారేమో అనుకునే ప్రమాదం ఉంది. బయట కూడా ఎవర్నీ నిక్ నేమ్స్ పెట్టి పిలవనివ్వకండి. - వ్యాయామం విషయంలో ఒత్తిడి చేయవద్దు. ఇలా చేస్తే సన్నబడతావ్ అంటూ అదీ ఇదీ చేయమని విసిగించకండి. తాము అలా ఉండటం అమ్మానాన్నలకు నచ్చడం లేదు అన్న ఫీలింగ్ వచ్చి తమ మీద తమకే అయిష్టత ఏర్పడుతుంది. - పొరపాటున వాళ్లు దిగులుగా కనిపిస్తే... ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. బయట ఎవరైనా కామెంట్ చేస్తున్నా, స్కూల్లో తోటి పిల్లలు ఏడిపిస్తున్నా వెంటనే వెళ్లి వాళ్లతో మాట్లాడండి. వాళ్లే సర్దుకుపోతారులే అనుకుంటే మీ పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒబెసిటీ అనేది ఓ సమస్య. అది లోపం కాదు. ఆ విషయం తెలియక బాధపడే చిన్నారుల్ని ఆ బాధ నుంచి బయట పడేయాలంటే ఈమాత్రం జాగ్రత్త తీసుకోక తప్పదు. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. కాదంటారా?! - Sameera

  బడి మీద భయం... మీరే చేయాలి దూరం!   స్కూళ్లు తెరుచుకున్నాయి. చిన్నారుల ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. పొద్దున్నే లేచి, స్నానాలు చేసి, పుస్తకాల సంచీలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు పిల్లలు. అయితే ఆల్రెడీ స్కూల్ అలవాటైపోయిన వాళ్లకి ఫర్వాలేదు. కానీ మొదటిసారి బడికి వెళ్తున్న పిల్లలతో మాత్రం పెద్ద తంటానే. నాలుగేళ్లు ఆడుతూ పాడుతూ గడిపేసిన వాళ్లకి... ఇప్పుడు సడెన్ గా ఓ కొత్త ప్రదేశానికి వెళ్లి, కొత్త మనుషుల మధ్య రోజంతా గడపడం అస్సలు నచ్చదు. దాంతో బెదిరిపోతారు. బడికి వెళ్లనంటూ మారాం చేస్తారు. కొంత మంది పిల్లలైతే నెలలు గడుస్తున్నా ఏడుస్తూనే ఉంటారు. అలా కాకుండా వాళ్లు ఆనందంగా బడికి వెళ్లేలా చేయాలి. అది కచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. - రోజూ స్కూల్ నుంచి వచ్చాక స్కూల్ ఎలా ఉంది అని అడగాలి. వాళ్లు బాలేదు అంటే ఏం బాలేదు అని అడగండి. అప్పుడు వాళ్లకు నచ్చని వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడండి. దాంతో వాళ్లలో మార్పు వస్తుంది. - పిల్లలకు టీచర్ అంటే చాలా భయమేస్తుంది. కాబట్టి ముందు టీచర్ ని ఇష్టపడేలా చేయాలి. అమ్మ, నాన్న ఏం కావాలన్నా టీచర్ నే అడగాలని, టీచర్ కూడా మమ్మీ డాడీల్లాగే చూసుకుంటుందని చెప్పాలి. - స్కూల్ కి తీసుకెళ్లినప్పుడు కొన్ని రోజులపాటు మీరు లోపలకు వెళ్లి టీచర్ తో కలివిడిగా మాట్లాడండి. అది చూస్తే తను కూడా మన మనిషే అన్న నమ్మకం కలుగుతుంది. - స్కూల్లో మీ పాప/బాబు పక్కన కూర్చునే వాళ్లతో కూడా మాట్లాడండి. అది చూసి పిల్లలు కూడా వాళ్లతో చనువుగా మాట్లాడతారు. కలిసిపోతారు. - ఇక పొద్దున్నే లేవడం కూడా పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. బడి మీద భయంతో అస్సలు లేవరు. లేచినా స్నానం చేయనంటారు. టిఫిన్ తిననంటారు. రకరకాల సాకులు చెబుతారు. ఎంత త్వరగా స్కూల్ కి వెళ్తే అంత త్వరగా ఇంటికి వచ్చేయవచ్చని చెప్పండి. రోజూ సాయంత్రం వచ్చాక తను ఎంజాయ్ చేసేది ఏదో ఒకటి రెడీగా ఉంటుందని చెప్పండి. తనకిష్టమైన ఫుడ్ ఐటమ్ చేస్తాననో, ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్తాననో ఏదో ఒకటి. దాంతో హుషారుగా వెళ్తారు. అందరు పిల్లల విషయంలోనూ ఇంత కష్టపడక్కర్లేదు. స్కూల్ అనగానే భయపడిపోయి ఎంతకీ అలవాటు పడని పిల్లల విషయంలో ఈమాత్రం కష్టపడక తప్పదు. ఒక్కసారి అలవాటు పడితే వాళ్లకీ ఇబ్బంది ఉండదు... మీకూ ఉండదు. - Sameera  

  పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు!     ‘ఐదేళ్ల చిన్నారి మీద అత్యాచారం’, ‘హాస్టల్‌ పిల్లల మీద వార్డెన్ అఘాయిత్యం’, ’పసికందు మీద 65 ఏళ్ల వృద్ధుని దాష్టీకం’.... ఇలాంటి వార్తలు నిరంతరం చదువుతూనే ఉంటాం. ఎక్కడో ఎవరికో జరిగింది కదా అనుకుని పెద్దగా పట్టించుకోం. కానీ నిజంగానే రోజులు బాగోలేవు! ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు కూడా లేనిపోని ప్రమాదాల బారిన పడే పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అదృష్టవశాత్తూ... చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు.   ఏది తప్పు – ఏది ఒప్పు అభంశుభం ఎరుగని పిల్లలకు వారి శరీరం గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి వారికి చెప్పే సందర్భమూ, చెప్పినా అర్థం చేసుకునే వయసూ కాదు. కానీ వారి శరీరంలోని భాగాల గురించి స్పష్టంగా చెప్పితీరాలని సూచిస్తున్నారు. అంతేకాదు! ఫలానా భాగాన్ని ఇతరులు ముట్టుకోవచ్చు, ఫలానా భాగాలను ఇతరులు ముట్టుకోకూడదు అంటూ నేర్పుగా సూచించాల్సి ఉంటుంది.   అయినవారే! ఒక సర్వే ప్రకారం దాదాపు 90 శాతానికి పైగా లైంగిక చర్యలు... తెలిసినవారి నుంచే ఎదురవుతున్నాయని తేలింది. అందుకని పిల్లలు ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఎవరితో మెలుగుతున్నారు, అవతలి వ్యక్తి స్వభావం ఎలా ఉంది అని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు వారి మానాన వారు తిరుగుతున్నారు కదా అని వదిలేస్తే, వారు సాఫ్ట్‌ టార్గెట్స్‌గా మారిపోతారు.   మగపిల్లలు కూడా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలు లైంగిక వేధింపులకి గురయ్యే అవకాశం తక్కువే! అలాగని వారు సురక్షితం మాత్రం కాదు. ప్రతి ఐదుగురు మగపిల్లల్లో ఒకరు, 18వ ఏట వచ్చేసరికి అత్యాచారానికి గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి వారి విషయంలోనూ తగినన్ని శ్రద్ధ తీసుకోవాల్సిందే!   బడిలో కూడా పిల్లలు ఇంటి తర్వాత బడిలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో టీచర్లో, పెద్ద తరగతి పిల్లలో హద్దు మీరే ప్రమాదం లేకపోలేదు. సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే భయంతో పాఠశాల యాజమాన్యం కూడా ఇలాంటి సంఘటనలను కప్పిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. అందుకని బడిని ఎంచుకునే సమయంలోనే, అక్కడ చదువు, ఆటపాటలతో పాటుగా క్రమశిక్షణ తీరుని గమనించాలి. కేవలం బడి మాత్రమే కాదు- ట్యూషన్‌ సెంటర్, కేర్‌ సెంటర్‌... ఇలా పిల్లల్ని భరోసాగా వదలిపెట్టే ప్రతి చోటా, అక్కడి వ్యక్తులు సరైనవారే అన్న అంచనాకు వచ్చితీరాలి.   చేతలే కాదు- మాటలు కూడా Sexual Abuse అనేది కేవలం చేతల్లోనే కాదు, మాటల ద్వారా కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకని మీముందు పిల్లలతో ఎవరన్నా తేడాపాడాగా మాట్లాడుతుంటే వెంటనే ఖండించండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఫలానా మాట సభ్యత కాదు అని పిల్లలు తెలుసుకుంటారు. ఎవరన్నా పిల్లలతో అలాంటి ‘బూతులు’ మాట్లాడుతున్నట్లు మీ దృష్టికి వస్తే జాగ్రత్తపడండి.   పిల్లవాడిలో మార్పు పిల్లవాడి రోజువారీ అలవాట్లలో కానీ, అతని స్వభావంలో కానీ అనూహ్యమైన మార్పు వస్తే... దానికి కారణం గుర్తించే ప్రయత్నం చేయండి. బడికి వెళ్లడానికి భయపడటం, ఎవరినన్నా చూసి వణికిపోవడం, మర్మాంగాల దగ్గర నొప్పిగా ఉందని చెప్పడం, ఎవరినీ దగ్గరకు రానీయకపోవడం, దిగాలుగా కూర్చోవడం... లాంటి లక్షణాలన్నీ పిల్లవాడు ఏదో సమస్యతో బాధపడుతున్నాడని చెప్పకనే చెబుతాయి. ఇలాంటి సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, పిల్లవాడితో నేర్పుగా మాట్లాడి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి.   ఈ జాగ్రత్తలన్నీ మనకి తెలియవని కావు. కాకపోతే ఏం జరగదులే అన్న ధీమాతో వాటిని అంతగా పాటించము. కానీ అదృష్టంలాగానే దురదృష్టం కూడా ఎవరినైనా వరించవచ్చు. కాబట్టి పిల్లలకు ఇలాంటి విషయాల మీద కాస్త అవగాహన ఏర్పడేవరకూ కంటికి రెప్పలా చూసుకోక తప్పదు. - నిర్జర.  

  కాన్పు కోసం తొందర వద్దు. ఎందుకంటే...     తల్లి కడుపులో బిడ్డ 40 వారాలు ఉంటే మంచిదని చెబుతుంటారు వైద్యులు. ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అనుకుంటే కనీసం 37 వారాల పాటు వేచి చూడమంటారు. 37 వారాల లోపుగానే బిడ్డను బయటకు తీయవలసి వస్తే ఆ శిశువును premature/ preterm babyగా పేర్కొంటారు. బిడ్డ ఎదుగుదలలో చివరి వారాలు చాలా కీలకం. వారిలోని ఊపిరితిత్తులు, కాలేయం ఆ సమయంలోనే బలాన్ని పుంజుకుంటాయి. అలాంటి సమయంలో బిడ్డను బయటకు తీయడం వల్ల తనకు లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయం చాలామందికి తెలిసిందే! బిడ్డ సంగతి అలా ఉంచితే... అటు తల్లి ఆరోగ్యానికి కూడా ఈ తరహా కాన్పు ఏమంత క్షేమం కాదంటున్నారు. బిడ్డకు ముందస్తుగా జన్మని ఇవ్వడానికీ, తల్లిలో గుండె సంబంధ వ్యాధులకూ మధ్య ఏమన్నా కారణం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. దీనికోసం 70,182 మంది స్త్రీల ఆరోగ్యాన్ని గమనించారు. వారిలో 37 వారాలకంటే ముందుగా బిడ్డకు జన్మనిచ్చినవారిలో గుండెసంబంధ వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక 32 వారాలకంటే ముందుగానే జన్మనిచ్చిన ఆడవారిలో ఈ ప్రమాదం మరింత మెండుగా కనిపించింది. అంతేకాదు! వీరు ఎంతమంది పిల్లలకు ఇలా ప్రీమెచ్యూర్‌గా జన్మనిస్తే, గుండెజబ్బుల ప్రమాదం అంతకంతా పెరగడాన్ని గమనించారు. గుండెజబ్బులకీ ముందస్తు కాన్పుకీ మధ్య సంబంధం ఉందని బలంగా తేలిపోయింది. కాబట్టి ఇకమీదట ఇలాంటి తల్లులు తమ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనీ, భవిష్యత్తులో గుండెజబ్బులు రాకుండా తగిన ఆరోగ్యసూత్రాలు పాటించాలనీ సూచిస్తున్నారు. కానీ వీరిలో గుండె జబ్బులు రావడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. రక్తపోటు, ఊబయాకం వంటి పరిస్థితులు బిడ్డలను కనేందుకు సమస్యలు సృష్టిస్తాయి. అవే పరిస్థితులు గుండెజబ్బుకి కూడా దారితీస్తాయి. అంతేకాదు! ముందస్తుగా పుట్టిన పిల్లలతో తల్లులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి ఆరోగ్యం తల్లిని నిరంతరం కలవరపరుస్తుంది. అది కూడా తల్లి గుండెకు భారంగా పరిణమిస్తుందని భావిస్తున్నారు. సిజేరియన్ అందుబాటులోకి వచ్చినతరువాత ముందస్తు కాన్పులు చాలా ఎక్కువైపోతున్నాయన్న ఆరోపణ ఉంది. దాదాపు పదిశాతం కాన్పులన్నా 37 వారాలకంటే ముందుగానే జరుగుతున్నాయని కొందరి అంచనా! ఈ నేపథ్యంలో ముందస్తు కాన్పులు తల్లి గుండెజబ్బుకి దారితీస్తాయనే హెచ్చరికని పెడచెవిన పెట్టడానికి వీల్లేదు. తస్మాత్‌ జాగ్రత్త! - నిర్జర.

  పిల్లలను చూసుకునే బలం ఎక్కడి నుంచి వస్తుంది?     నవమాసాలూ మోసి బిడ్డని కనడం ఒక ఎత్తు. వారిని ఓపికగా పెంచడం మరో ఎత్తు. అందుకే ఆడవారి ఓర్పు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ లేదు. కానీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేంత నైతిక బలం వారికి ఎక్కడి నుంచి వస్తుంది. పిల్లవాడి ఏడుపు, చిరాకు, అల్లర్లను భరిస్తూనే... వారి అవసరాలను గమనించుకునే సామర్థ్యం వారికి ఎలా అబ్బుతుంది! బిడ్డను చూసుకోవడానికి తల్లి ఉంటుంది. కానీ తల్లిని చూసుకోవడానికి ఎవరున్నారు? అన్న ఆలోచన వచ్చింది ఇద్దరు పరిశోధకులకు. ఆ ఆలోచనకి జవాబు కూడా లభించింది. అదేమిటో మీరే చూడండి…   పిల్లల్ని పెంచే క్రమంలో తల్లులకు బలం ఎక్కడి నుంచి వస్తుందో తేల్చేందుకు పరిశోధకులు ఓ రెండువేల మందిని ప్రశ్నించి చూశారు. ఈ రెండువేల మంది కూడా పిల్లల్ని సాకుతున్నవారే. ఉన్నత విద్యను అభ్యసించి, పిల్లల పెంపకం గురించి పూర్తి అవగాహన ఉన్నవారే! వీరు చెప్పినదాన్ని బట్టి తల్లిగా బాధ్యతలు నిర్వహించేందుకు నాలుగు అంశాలు బలాన్ని ఇస్తాయని తేలింది.   Unconditional acceptance:  తన చుట్టూ ఉన్నవారు ఎలాంటి అరమరికలు, అభ్యంతరాలు లేకుండా తనని స్వీకరిస్తున్నప్పుడు ఎంతటి శ్రమనైనా ఓర్చుకునే స్థైర్యం లభిస్తుంది. పిల్లలను తల్లి ఎలాంటి షరతులు లేకుండా ప్రేమిస్తుంది. కానీ అలాంటి ప్రేమ ఆ తల్లికి కూడా దొరికినప్పుడు ఆమెకు కావల్సిన నైతిక బలం దొరుకుతుంది.   Authenticity in relation:   భర్తతో పాటు ఉంటే అది సంసారం. కానీ ఆ భర్త అర్థం చేసుకునేవాడైతేనే అది కుటుంబం. భర్త సహకారాన్నీ, ప్రేమనూ పొందినప్పుడు... పిల్లల్ని పెంచేందుకు కొండంత బలం వస్తుందంటున్నారు. తన చుట్టూ ఉన్న బంధాలు... నిజాయితీగా, దృఢంగా ఉన్నప్పుడు అవి తల్లికి రక్షణగా నిలుస్తాయట.   Feeling comforted: మనసు భారంగా ఉన్నప్పుడు భుజం మీద చేయివేసేవారు లేకపోతే... నిరాశ తప్పదు. అలా మనసుకి కాస్త సాంత్వన కావాలని అనుకున్నప్పుడు అది లభిస్తే, పిల్లల్ని పెంచడంలో శ్రమే తెలియదని అంటున్నారు తల్లులు.   Friendship satisfaction: పెళ్లయితే స్నేహాన్ని కొనసాగించడం కష్టం, పిల్లలు పుడితే ఇక స్నేహితులు దూరమైపోతారు... లాంటి ఆలోచనలు సహజం. కానీ స్నేహితుల రాకపోకలు సాగుతూ, వారితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే... తల్లిగా తన బాధ్యతలని ఆడుతూపాడుతూ నిర్వహించేందుకు కావల్సిన బలం వస్తుందంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ తల్లి పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, పిల్లలకి ఏం కావాలి, వారి అభివృద్ధి ఎలా జరుగుతుంది...లాంటి విషయాల మీదే దృష్టి సారించాయి. కానీ మొదటిసారిగా- అసలు తల్లికి ఏం కావాలి? అన్న ప్రశ్నతో సాగిన ఈ పరిశోధన అమ్మతనం మీద విలువైన విషయాలెన్నో స్పష్టం చేసింది. ఆ విషయాలని సమాజం గుర్తిస్తుందని ఆశిద్దాం.  - నిర్జర.  

  వేసవిలో పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు   వేసవి కాలం వచ్చిందంటే తల్లుల బాధ్యత రెట్టింపవుతుంది. వేడి కారణంగా పిల్లలకు ఏ సమస్య వస్తుందో, వాళ్లని ఎలా కాపాడుకోవాలో అనే టెన్షన్ పెరుగుతుంది. నిజానికి అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. వేసవి వస్తోందనగానే పిల్లల సంరక్షణ విషయంలో ఏమేం చేయాలనేది ప్లాన్ చేసేసుకోవాలి. అప్పుడు ఏ సమస్యా ఉండదు. ఒకవేళ మీరు అలా ప్లాన్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా ఈ జాగ్రత్తలు తీసుకోండి. వేసవిలో పిల్లలకు వచ్చే మొట్టమొదటి సమస్య డీ హైడ్రేషన్. అందుకే ప్రతి పావుగంటకో సారి కాసిన్ని నీళ్లు పట్టించండి. వాళ్లు తాగనని మొరాయించినా సరే.. ఎలాగో బుజ్జగించి పట్టించండి తప్ప వదిలిపెట్టకండి. అలాగే చక్కని పోషకాహారం అందించడం కూడా అవసరం. రోజుకు కనీసం రెండు మూడు గ్లాసుల పాలు పట్టించండి. వీలైనంత ఎక్కువగా పండ్డు వాళ్ల కడుపులోకి వెళ్లేలా చూడండి. పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఓ పట్టాన ఇష్టపడరు. కాబట్టి ఏ జ్యూస్ రూపంలోనో, స్వీట్ రూపంలోనో ఇవ్వడానికి ట్రై చేయండి. గోధుమలు, రాగులు, బాదం, జీడిపప్పు, సోయా గింజల్ని వేయించి పిండి పట్టించండి. దీనితో జావ కాసి పట్టిస్తే బలం వస్తుంది. కూరగాయల్ని కూడా అన్నంతో కలిపి ఉడికించి పెట్టేయండి. వేడికి తట్టుకోలేక పిల్లలు ఐస్ లు, ఐస్ క్రీముల కోసం గొడవ చేస్తుంటారు.  చల్లటి నీళ్లు తాగేస్తుంటారు. అది చాలా ప్రమాదం. వాళ్లకు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. టాన్సిల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఓవర్ హీట్ చేసి జలుబు, జ్వరం వంటివి కూడా రావొచ్చు. అందుకే పిల్లలు అతి చల్లటివి ఎక్కువ ఇవ్వకండి. ఇక వేసవిలో పిల్లలకు స్కిన్ ప్రాబ్లెమ్స్ కూడా వస్తాయి. అందుకే వాళ్లకి వేసే దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నైలాన్, సిల్క్ వంటివి వేయకుండా వదులైన కాటన్ దుస్తులే వేయాలి. చెమటతో దుస్తులు తడిచిపోతే వెంటనే మార్చేయాలి. ముఖ్యంగా లో దుస్తులు, డైపర్లు వీలైనన్ని ఎక్కువసార్లు మార్చాలి. అప్పుడప్పుడూ చల్లని నీటితో ముఖం కడుగుతూ ఉండాలి. అయితే స్నానం మాత్రం మరీ చల్లని నీటితో చేయించకండి. లేదంటే ఒళ్లు పేలటం వంటి సమస్యలు రావొచ్చు. అలాగే విటమిన్ లోపాల కారణంగా అలర్జీలు వస్తాయి. అందుకే విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాదు... ఆటల పేరుతో పిల్లలు బాగా అలసిపోతూ ఉంటారు. నీరసించి పోతారు. అందుకే బయటకు ఎక్కువ వెళ్లనివ్వకండి. నీడపట్టునే ఉండేలా చూసుకోండి. ఇండోర్ గేమ్స్ ఆడించండి. పెయింటింగ్, టాయ్ మేకింగ్ లాంటివేమైనా చేయించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సమ్మర్ వల్ల మీ చిన్నారులకు ఏ సమస్యలూ రావు. - Sameera    

  అటు ఉద్యోగం... ఇటు పిల్లలు... సాధ్యమే!   ఆడవారు అన్నిరంగాల్లోనూ సమానంగా అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. ప్రతిచోటా మగవారికి దీటుగా నిలుస్తున్నారు. కానీ ఈ సందడిలో పడి తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో అన్న అనుమానం వాళ్లని పీడిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఆ ఆలోచన వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. కొన్ని జాగ్రత్తలను పాటిస్తుంటే అటు తల్లిగానూ, ఇటు ఉద్యోగిగానూ తమ పాత్రను సమర్థవంతంగా పోషించవచ్చునంటున్నారు నిపుణులు... గిల్టీ ఫీలింగ్ వద్దు చాలామంది తల్లులకు తాము ఉద్యోగం చేయడం వల్ల పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నామేమో అన్న అపరాధ భావం వెంబడిస్తూ ఉంటుంది. కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తున్నాన్న ఆలోచనతో ఆఫీసులోనూ, ఆఫీసు పని సక్రమంగా చేయలేకపోతున్ననాన్న బాధతో ఇంట్లోనూ క్రుంగిపోవద్దని సూచిస్తున్నారు. ఉన్న సమయాన్నీ, వనరులనీ సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో అన్న ఆలోచనే కానీ... వెధవ ఉద్యోగం చేయకపోతే బాగుండేది అన్న బాధతో జీవించవద్దని చెబుతున్నారు. ఉదయం వేళలు కీలకం చాలా ఇళ్లలో ఉదయం వేళలు హడావుడిగా సాగుతూ ఉంటాయి. పిల్లల్ని బడికి తయారుచేయడం, వంట చేయడం, తను ఆఫీసుకి తయారవడం... లాంటి సవాలక్ష పనులతో ఆడవారు పగలు పొగలు కక్కుతుంటారు. సహజంగానే ఇన్ని పనులతో చిరాకు కలుగుతుంది. అది భర్తతో వాదనలకీ, పిల్లలతో తిట్లకీ దారితీస్తుంది. అందుకే ఉదయం వేళలు వీలైనంత ప్రశాంతంగా సాగిపోయేలా చూడమంటున్నారు. బ్యాగ్ సర్దుకోవడం, టిఫిన్ పెట్టుకోవడం లాంటి చిన్నచిన్న పనులు పిల్లలే చేసుకునేలా ప్రోత్సహించాలి. యూనిఫాం సిద్ధం చేయడం, హోంవర్కు చేయించడం వంటి పనులు రాత్రివేళే ముగించుకునే ప్రయత్నం చేయాలి. మల్టీ టాస్కింగ్ ఆడవారికి మల్టీ టాస్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే సమయంలో రెండు విభిన్నమైన పనులను ఎలాంటి ఒత్తిడీ లేకుండా కానిచ్చేయడమే మల్టీటాస్కింగ్. టీవీ చూస్తూ కూరలు తరుక్కోవడం, ఫోన్ మాట్లాడుతూ కూర కలియతిప్పడం, ప్రయాణంలో ఫైల్స్ చూసుకోవడం... అన్నీ మల్టీ టాస్కింగ్ కిందకే వస్తాయి. మొదట్లో కాస్త కొత్తగా, అసౌకర్యంగా ఉన్నా... అలవాటయ్యేకొద్దీ సులువనిపిస్తాయి. అన్నింటికీ మించి విలువైన సమయాన్ని ఆదా చేస్తాయి. పిల్లల ఆశని గమనించాలి తల్లి ఉద్యోగం చేస్తోందంటే పిల్లలకి సహజంగానే ఇబ్బందిగా ఉంటుంది. అమ్మ తనతో ఎక్కువసేపు గడపడం లేదన్న ఆరోపణా ఉంటుంది. అందుకే వారి ఆరోపణలని ఓపికగా వినండి. ఇంట్లో వీలైనంత సమయాన్ని వారితో గడిపే ప్రయత్నం చేయండి. సాయంత్రం వేళ అలా వారిని షికారుకి తీసుకువెళ్లేందుకూ, అప్పుడప్పుడూ టూర్ ప్లాన్ చేసేందుకూ ప్రయత్నించండి. మీరు వారికి quantity of time ఇవ్వలేకపోవచ్చు, కానీ quality of time ఇచ్చే ప్రయత్నం చేయండి. వీలైతే వారితో గడిపేందుకు ఒక షెడ్యూల్ని కూడా ఏర్పాటు చేసుకోండి. రూపాయి కోసం చాలామంది మధ్యతరగతి భారతీయులకి ప్రతి రూపాయీ జాగ్రత్తగా ఖర్చుచేసుకోవాలన్న తపన ఉంటుంది. అది సహేతుకమే! కానీ ఒక రూపాయి ఖర్చుపెడితే కాస్త విలువైన సమయం మిగుల్తుంది అనుకుంటే వెనక్కి తగ్గవద్దు. పనిమనుషులకి, వాషింగ్ మెషిన్లకీ, మైక్రోవేవ్ ఓవెన్లకీ, వాక్యూం క్లీనర్లకీ, టూర్లకీ, సినిమాలకీ... కాస్త డబ్బు ఖర్చుచేయడం ద్వారా పిల్లలతో విలువైన కాలాన్ని గడిపే అవకాశం ఉందనుకుంటే పర్సు బయటకు తీయాల్సిందే! సమయమే డబ్బు – సమయమే బంధం మనకి తెలియకుండానే చాలా సమయం అనవసరమైన విషయాలకి వెచ్చస్తూ ఉంటాము. వాటికి అలవాటుపడిపోవడం వల్ల సదరు విషయాలు చాలా అవసరమైనవిగా, అవి లేకపోతే జీవితం లేదేమో అన్నట్లుగా తోస్తాయి. రోజూ పొల్లుపోకుండా పేపరు చదవడం, సీరియల్స్ చూడం, వాట్సప్లో మునిగిపోవడం... ఇలా గడచిపోయిన రోజుని ఓసారి గుర్తుచేసుకుంటే సమయాన్ని abuse చేసిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఆ అలవాట్ల మీద నియంత్రణ సాధిస్తే బోలెడు సమయం మిగుల్తుంది. - నిర్జర.    

    పిల్లల మాటకు విలువివ్వండి     "ఎన్నిసార్లు చెప్పాలే... లేచి తయారవ్వమంటే అవ్వవే. ఫంక్షన్ కి టైమవుతోంది''... అరుస్తూనే ఉంది మాధవి. పదేళ్ల సిరి మాత్రం ఉన్నచోట నుంచి కదలడం లేదు. తయారవ్వడం లేదు. మాధవికి కోపం పెరిగిపోయింది. వచ్చి రెండు దెబ్బలేసింది. సిరి ఏడవడం మొదలుపెట్టింది. కానీ లేచి రెడీ మాత్రం అవ్వలేదు. కూతురి తీరు అర్థం కాక తల పట్టుకుంది మాధవి. ఎప్పుడూ చలాకీగా ఉండే పిల్ల ఎందుకింత డల్ అయిపోయిందో... బైటికంటే చాలు హుషారుగా రెడీ అయిపోయేది ఎక్కడికి రమ్మన్నా ఎందుకు కదలడం లేదో అర్థం కావట్లేదు మాధవికి. ఆమెకే కాదు. చాలామంది తల్లులకి తమ పిల్లల్లో హఠాత్తుగా మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అరుస్తారు, తిడతాడు, కొడతారు. అది చాలా తప్పు. ఎందుకంటే పిల్లల్లో వచ్చిన ఆ మార్పుకి కారణం... వేధింపు కావచ్చు.   వేధింపులనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొట్టడం, తిట్టడం, లైంగికంగా హింసించడం, మనసు గాయపడేలా విమర్శించడం, కఠినమైన శిక్షలు విధించడం ఇలా. నిజానికి సరైన ప్రేమ చూపించకపోవడం కూడా హింసే అంటున్నారు మానసిక నిపుణులు. అయితే వీటిన్నిటిలోకీ లైంగిక హింసే అధికంగా ఉంటోందని రికార్డులు చెప్తున్నాయి. లైంగిక హింస శరీరాన్నే కాదు, మనసును కూడా తీవ్రంగా గాయపరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల మనసును చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిల్లలు నోరు విప్పి చెప్పుకోలేరు. కొన్నిసార్లు అది హింస అని, దాన్ని ఎవరికైనా చెప్పాలని అన్న ఆలోచన కూడా వాళ్లకి రాదు. అందుకే మౌనంగా, దిగులుగా అయిపోతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాలు గమనించుకోవాలి.   స్కూల్లో టీచర్లు, ఇంటి చుట్టుపక్కలవారు, తరచుగా ఇంటికి వచ్చే స్నేహితులు బంధువులు పిల్లల పట్ల ఎలా ప్రవరిస్తున్నారో ఓ కంట కనిపెట్టాలి. ఏమైనా తేడా కనిపిస్తే వాళ్లని దూరంగా ఉంచాలి. ఏం జరిగింది అని పిల్లల్ని సున్నితంగా అడగండి. నువ్వు బాధపడితే నేను చూడలేను, నిన్ను బాధపెట్టిన వాళ్లెవరైనా సరే ఊరుకోను అంటూ వాళ్లకి భరోసా ఇవ్వండి. ధైర్యం వచ్చి నోరు మెదుపుతారు. మీ వల్ల కాకపోతే చైల్డ్ సైకాలజిస్టు సాయం తీసుకోండి.     అయితే ఆ పరిస్థితి రాకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. వీలైనంత వరకూ పిల్లల్ని పరాయివాళ్ల ఇళ్లలో వదిలిపెట్టడం, పరాయివాళ్లతో బైటికి పంపడం చేయవద్దు. మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఏయే విధంగా ప్రవర్తిస్తారు, ఎప్పుడు అనుమానించాలి, ప్రవర్తన ఎలా ఉంటే దూరంగా ఉండాలి అనే విషయాలను పిల్లలకు వివరించాలి. లోబర్చుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో, వాటికి లొంగకుండా ఎలా ఉండాలో నేర్పించాలి. తాకకూడదని చోట తాకుతున్నా, దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తర్ఫీదునివ్వాలి. చిన్నపిల్లలు కదా అని పెద్ద విషయాలు చెప్పడానికి సంకోచిస్తే... తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.     అయితే ఈ సమస్యలో ఇంకొక కోణం కూడా ఉంది. కొంతమంది పిల్లలు నోరు తెరచి తల్లిదండ్రులకు విషయం చెప్తారు. ఫలానా అంకుల్ ఇలా చేస్తున్నాడనో, ఫలానా అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడనో చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ల మీద ఉన్న సదభిప్రాయంతో పిల్లల మాట తీసిపారేస్తారు కొందరు తల్లిదండ్రులు. ఆ నిర్లక్ష్యానికి మూల్యం... మీ చిన్నారి జీవితం. అందుకే ఎప్పుడూ అలా చేయకండి. వాళ్ల మాటకు విలువివ్వండి. ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. చాడీలు చెప్పకు అని కోప్పడ్డారో... ఇంకెప్పుడూ వాళ్లు మీకు ఏ నిజమూ చెప్పరు... గుర్తుంచుకోండి. లోకమంటే ఏమిటో తెలియని చిన్నారులు. ఏ ప్రమాదం వస్తుందో ఎటు నుంచి వస్తుందో వాళ్లకు తెలియదు. కాబట్టి వాళ్లని కాచుకోవాల్సిన బాధ్యత మనదే. ఆలోచించండి. -Sameera

  తల్లిపాల కోసం ప్రాణాలు తీయవద్దు!     బిడ్డకి తల్లిపాలే శ్రేష్టం! తల్లిపాలకి మించిన ప్రత్యామ్నాయం లేదు!... ఇలాంటి నినాదాలు చాలానే వింటూ ఉంటాము. అప్పుడే పుట్టిన పిల్లవాడికి తల్లిపాలు కాకుండా డబ్బాపాలు పట్టించడం మంచిది కాదు అని పెద్దలు, నిపుణులు అంతా చెవిలో పోరుతూ ఉంటారు. ఇవన్నీ నిజమే! కానీ ఈ నిజం వెనుక ఓ ప్రమాదం దాగి ఉందంటే నమ్మగలరా! జిలియన్ జాన్సన్ అనే మహిళ ఈ మధ్య తన అనుభవాన్ని Fedisbest అనే వెబ్సైటులో పంచుకున్నారు. ఆ వెబ్సైటు ద్వారా జాన్సన్ రాసిన లేఖ ఒక సంచలనంగా మారింది. తల్లిపాల మీద మోజుతో తన బిడ్డను చేజేతులారా చంపుకున్నాను అన్నదే ఆ లేఖలోని సారాంశం!!! కృత్రిమమైన పాలని formula milk అంటారు. ఈ డబ్బా పాలని మరీ అత్యవసరం అయితే తప్ప పట్టించవద్దని వైద్యులు సూచిస్తుంటారు. తల్లికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే తప్ప, ఆమె పాలు ఇచ్చితీరాల్సిందే అన్న ధోరణిలోకి చాలా ప్రసూతి ఆసుపత్రులు కూడా ఉంటున్నాయి. కొన్ని దేశాలలో అయితే పిల్లవాడికి పాలు సరిపోవడం లేదని పిల్లల వైద్యులు సిఫారసు చేస్తే తప్ప, డబ్బా పాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. తల్లిపాల కోసం ఇంతటి ప్రాముఖ్యతని ఇవ్వడం అర్థం చేసుకోదగ్గదే! ఎందుకంటే తల్లిపాలలో లభించే పోషకాలు, కృత్రిమపాలలో ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకవు. పైగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి రోజులలో స్రవించే తల్లిపాలలో పిల్లవాడికి రోగనిరోధక శక్తిని అందించే యాంటీబాడీస్ ఉంటాయి. వీటని ‘colostrum’ అంటారు. అయితే ఈ colostrums లభించని పిల్లవాడి జీవితం వృధా అనీ, ఎలాగొలా బిడ్డకు తల్లిపాలే పట్టించాలనీ నూరిపోయడమే కొన్ని సమస్యలకి కారణం అవుతోంది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత... మరీ ముఖ్యంగా తొలి చూలు తరువాత, పిల్లవాడికి తల్లిపాలని తగినంతగా అందించలేకపోవచ్చు. తల్లి నీరసంగా ఉండటం, పాలు రాకపోవడం, వచ్చినా సరిపోకపోవడం, పిల్లవాడు పాలు తాగే అలవాటు చేసుకోలేకపోవడం, చనుమొనలు లోపలకి ఉండిపోవడం... వంటి అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇవన్నీ తీరేలోగా పిల్లవాడికి ప్రత్యామ్నాయం చూడటం చాలా అవసరం. ‘ఇప్పుడే డబ్బా పాలు పట్టించేస్తే ఎలాగా? ఓ నాలుగైదు రోజులు ఓపిక పట్టాలి కదా!’ అని అశ్రద్ధ చేస్తే పిల్లవాడు డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జాన్సన్ కథ కూడా ఇలాగే సాగింది. పిల్లవాడికి ఎలాగొలా తన పాలే పట్టించాలని ప్రయత్నించింది జాన్సన్. ఈలోగా అతను డీహైడ్రేషన్కు లోనయ్యాడు. 19 రోజుల పసికందు గుండెపోటుతో మరణించాడు!!! జాన్సన్ విషాదం సమాజానికి చాలా విలువైన పాఠాలు చెబుతోంది. తల్లిపాలు శ్రేష్టమే! కానీ అన్నింటికంటే ముందు పిల్లవాడి కడుపు నిండటం ముఖ్యం. అందుకే పిల్లవాడు బరువు తగ్గిపోతున్నా, మూత్ర విసర్జన చేయకున్నా, అదేపనిగా ఏడుస్తున్నా... అతనికి తగినంత ఆహారం అందడం లేదన్న సూచనని గ్రహించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డబ్బా పాలతో అతని శరీరం బలహీనపడిపోతుందేమో అన్న భయాన్ని వీడి... పసి ప్రాణాలకే తొలి ప్రాధాన్యత అని గ్రహించాలి. - నిర్జర.      

    పిల్లలపై పేరెంట్స్ ప్రభావం..     విక్కీకి ఓ సబ్జెక్టులో ఫెయిలయ్యాడు. షాకైపోయింది రాధిక. ఎందుకంటే తన కొడుక్కి ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మరి వాడు ఫెయిలైపోవడం ఏమిటి? అర్థం కాక టీచర్ ని నిలదీసింది. ఈ మధ్య విక్కీ అస్సలు సరిగ్గా చదవట్లేదని, హోమ్ వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదని, ఇలా అయితే ఫైనల్ పరీక్షల్లో కూడా ఫెయిలవుతాడని టీచర్ అనేసరికి మళ్లీ షాకయ్యింది రాధిక. విక్కీ అలా ఎందుకైపోయాడో ఆమెకు అర్థమే కాలేదు. విక్కీని అడిగితే ఏడుస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు.   ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో ఉందా? ఉంటే ఆవేశపడకండి. మీ పాప/బాబుని తప్పు పట్టి తిట్టేయకండి. తను అలా అయిపోవడంలో మీ ప్రభావం ఏమైనా ఉందేమో పరిశీలించుకోండి అంటోంది ఓ ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ. ఎందుకంటే తల్లిందండ్రులకు సంబంధించినంత వరకూ పిల్లలెప్పుడూ హుషారుగా ఉండాలి. సందడి చేయాలి. బాగా చదవాలి. అందరిలోనూ మంచి పేరు తేవాలి. అన్నీ మన కోరికలే. మన ఆశలే. మన అంచనాలే. మరి మన పిల్లలు మన నుంచి ఏం కోరుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచిస్తామా?  పిల్లల అంచనాలకు తగ్గట్టు తల్లిదండ్రులు లేకపోతే వాళ్లు జీవితంలో ఎంత వెనకబడిపోతారో తెలుసా? తమకు తెలుసంటోంది ఓ ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ. ఇటీవల వాళ్లు చేసిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.   అస్తమానం పోట్లాడుకునే అమ్మానాన్నల పెంపకంలో పెరిగే  పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు ఆ సర్వేకి అధ్యక్షత వహించిన చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ మారియా. తరచూ పోట్లాడుకునే తల్లిదండ్రులు ఉన్న వాతావరణంలో పెరిగే పిల్లలు కొందరు మొండిగా తయారవుతారట. మానసికంగా దెబ్బ తిని అన్నింట్లో వెనకబడిపోతారట. కొందరు మౌనంగా అయిపోతే ఇంకొందరు మరీ హుషారుగా తయారైపోయి తప్పుదార్లు తొక్కుతారట. వాళ్లలో కోపం, ద్వేషం, పగ వంటివి పెరిగిపోయి నేరాలకు పాల్పడతారట.  చిన్న వయసులోనే నేరాలు చేసినవాళ్లు, ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లలో ఎక్కువమంది ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలే అంటున్నారు. కొన్ని వందల మంది బాల నేరస్థుల గాథలు పరిశీలించాక ఈ విషయం అర్థమయ్యింది. అది మాత్రమే కాక మానసిక ఒత్తిడి, మతిమరుపు, పరధ్యానం, ఆకలి తగ్గిపోవడం, నత్తి రావడం, పలు రకాల మానసిక వ్యాధులు కూడా పిల్లల్ని చుట్టుముడతాయని తేలింది.   చూశారు కదా! ఒకవేళ మీరు కనుక మీ పిల్లల ముందు పోట్లాడుకుంటున్నా, వాళ్ల ముందే తిట్టుకుని కొట్టుకుంటున్నా, నేను ఎక్కువ నువ్వు తక్కువ అంటూ ఒకరినొకరు అవమానించుకుంటున్నా, నువ్వలా నేనిలా అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నా వెంటనే అవన్నీ ఆపేయండి. పిల్లల జీవితాల కంటే మన అహం ఎక్కువ కాదు కదా!     - sameeranj

  A Massage for Your Baby's Growth     Do you know the importance of massaging your baby’s body? It will strengthen your baby from within. You must know the right way to massage a baby. The best time to massage is during the pre crawling period. When you are massaging put your baby on a mat and remember to avoid massage immediately before or after a meal. Keep baby oil ready when you decide give a massage. Always remember to start your message with the baby’s legs. Hold the baby’s leg and squeeze gently as if you were milking the leg. Repeat the same with the other leg. Rotate the baby’s foot gently in clockwise and anti clockwise direction. It also simple to massage your baby’s arms. Start with the baby’s armpits and move upwards just in the same milking motion like you did for the legs. Trace your baby’s palms in small circular motion. This way you improve circulation in your baby’s body. Put your hands in prayer position and gently tap on your baby’s chest. Turn your baby over and make circular movements with  your finger tips on the baby’s back. Do this everyday for your baby’s growth and development. Make sure you give a regular massage to get the best results. - KRUTI BEESAM

Baby Massage Tips   A foot bath is a wonderful way to pamper the expecting mom at her baby shower, and allow her to rest her tired, achy feet. Here are some tips you can follow. 1. Fill a basin full of comfortably warm water and gentle soap. Allow her to soak her feet for a few minutes. 2. Add foot salts to relieve any aches in her feet and legs. 3. Sprinkle the water with flower petals or herbs. For example: rose petals, lavender buds, mint, lemon balm or calendula buds. 4. Remove one foot from the basin while the other still soaks and trim her toe nails. Put that foot back in and proceed with the other foot. 5. Now it's time to exfoliate. One foot at a time, gently scrub with pumice stone to remove tough and calloused areas on the feet and toes. 6. Dry each foot with cornmeal, a symbol of fertility, luck and protection, or dry with a towel. Please note: Lavender and Rose are generally considered safe for a woman in her third trimester. However, if the mom-to-be is suffering any complications or you wish to use any of the above mentioned herbs, it's best to consult their use with her doctor.

    Winter Care for Babies and Kids     Winter arrives in India and Autumn in the Western Countries, and it is time to bring out those warm clothes for everyone in the family especially the younger ones and kids as they are still developing immunity and they need protection from the changing harsh weather. Some parents don't bother much, they intentionally dont offer sensitive care to the younger ones. According to them, this kind of treatment helps kids become stronger and develop their immunity . Another approach towards Babycare is to offer intense care every day.     During these colder months of the year, especially during the first few days of sudden climatic change, it is important to protect children, in that case, everyone, as immunity gets disturbed. Colds, Sore throat and coughs attack easily and skin tends to dry out quickly too. Dehydration is assumed to be rampant during Summer months, but the Winter days can also cause dehydration and hence, colds intensify. Allergies are so common due to pollen grains, dust and they force fevers to spread. The right nutrition and hygiene is extremely important to develop immunity and maintain it inorder to fight these common seasonal climatic ailments.   Regular monitoring of a child's diet and physical fitness is so important and valuable in keeping track of their health changes and in protecting them from falling sick often. If it is a School going child, then utmost care to maintain their immunity is necessary, otherwise they get sick and the whole family could catch it, including a younger sibling. Starting from the right protective winter gear and outfits, to maintaining a hygienic environment at home and general surroundings, to consuming winter based vegetables and fruits to naturally boost their good health is key to Perfect Winter care for Babies and Kids.   ..Prathyusha

    Yes to Diapers or Not!     It is a fight between the generations, about whether to use Diapers for a Newborn or not..There are various opinions on if Diapers are really safe to use, if there is no chlorine reaction or any infection caused due to over usage of Diapers ? The older generations have used the home-made cloth diapers for ages...then, there was no worry about wasting water to wash so many cloth diapers, and there were either workmaids to help with the chore or some family member to help but with water supply issues, no household help, busy lifestyle and better financial abilities, using Diapers have become economical. So many famous and wellnamed brands marketing their Diapers, there is alot of competition, sametime, wide variety of options to choose from. Many designs, sizes, features like fast-drying, super absorbent, overnight use, specific colors for baby boys and girls too..and such features have made even Diapers the most sought after items for Babycare.     Many Environmentalists have had an opinion that disposable diapers are polluting, with their very low bio-degradability chance but after many studies proved that Cotton cloth diapers cause more monetary investment, the amount of detergent and chemicals used to pretreat and wash is more and they take many years to degrade biologically..hence disposable diapers do not much harm compared to cloth diapers....to raise cotton crop is expensive too, except that they seem to save money to the consumer if the water bills are not counted!     When the baby's health is taken into account, disposable diapers with high-absorbency features keep the child happy, compared to cloth diapers which if not changed on wetting, may cause rash quickly. However, other kinds of skin rashes are common if either kind of diapers are not changed regularly and yeast infections are a must-to-be-cautious about during the first 12months of a child's birth. Disposable diapers always come with the comfort of changing on-the-go...Mom doesnot have to worry about where to dispose them off or skillfully or awfully carry the soiled cloth diaper home after her day-out. Buying bulk from a retail store or from a wholesaler is the smart trick when using disposable ones...which brand to use is definitely your choice, friends and relatives will take care of the decision! These are not like medicines or babyfood, if you dont like a brand, change to another...research is the key...so which one on-demand, Pampers, Huggies or the Organic options these days like The Honest Company and BabyGanics etc...   ...Prathyusha

  Nurturing the Little Music Lovers     Raising Music Lovers is an art! Now where did that art of music come from..would you wonder for days..no, you won't, it came from your spouse or you or any immediate relative. In olden days, there were numerous music traning schools, tuitions found in every street and attending either a vocal class or an instrumental music class was so common. Even Parents who themselves were just good music listeners also encouraged their kids to not just enjoy music but also learn. Traditionally, in villages and towns, music was heard right early after dawn. These days, music still exists but not everyone is bothered about learning the art. I am personally a music lover, and i am not just writing these lines for fun...the Research has spoken too...that Playing Instruments or Singing as a habit prior to and during School years offers lifelong benefits to Children and helps them develop concentration in studies and congnitive skills too.     A recent study shows that Children who harbored an early interest in Singing and playing musical instruments displayed advanced reading and vocabulary skills, similar is the case with their attendance rates to regular school and increased chances to excel in examinations. Research also revealed that Schools and Colleges that had music programs in their curriculum has greater graduation rate and student attendance rate compared to other Schools and Universities. Music plays a key role in nurturing a child's self confidence and persona...at the sametime, it offers an employment solution to students, they earn while they study by teaching music to others or playing instruments and singing in social and corporate programs.  Parents need not force a child to learn music..but keenly observing whether the child has any music interest and encouraging it is key. Forcing the child to learn music, just because either of the parents is a music lover works negatively, hence accept the truth and let the child remain a good music appreciator only. Not every child is open to start singing, some are shy, they remain as bathroom singers, let them be...but if he/she likes to play instruments of any sort, explore the oppurtunities around your home or in the city and 'Get Set Go'. You will be loosing some restful time due to running between home, school and music classes too, but, the hardwork is definitely fruitful!!  This effort adds to your happy family bonding too, a child who knows his/her parents encourage their hobbies and interests, certainly loves them and feels thankful !   ..Prathyusha