100లో 30 రోజులు మిగిలాయ్!
on Oct 9, 2018
స్టార్ హీరోలతో సినిమా అంటే మినిమమ్ హండ్రెడ్ డేస్ షూటింగ్ చేయాల్సిందే! అంత కంటే ఎక్కువ రోజులు తీసుకుంటున్న సినిమాలు కూడా ఉన్నాయ్. ‘బాహుబలి’ వంటి హిస్టారికల్ మూవీస్‌కి మూడు నాలుగేళ్ళ కావాల్సిందే. వాటిని తప్పిస్తే... మ్యాగ్జిమమ్ కమర్షియల్ సినిమాలకు షూటింగ్ డేస్ హండ్రెడ్ కంటే ఎక్కువ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 100 డేస్ షెడ్యూల్ వేసుకున్నారు. కాని వంద రోజులు షూటింగ్ చేయలేదు. 70 రోజుల్లో సినిమాను ఫినిష్ చేసేశారు. ఎన్టీఆర్ స్పీడు వల్లే ఇదంతా సాధ్యమైందని త్రివిక్రమ్ చెప్పారు.
ఎన్టీఆర్‌తో పని చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏడు గంటలకు సెట్‌కి రమ్మని చెబితే... ఆరున్నకు ఎన్టీఆర్ సెట్‌లో వుంటారనీ, మేకప్ వేసుకుని రావాలా? లేదంటే మేకప్ వేసుకోకుండా రావాలా? అని అడిగే వారనీ, దాంతో తాము ఆరింటికి సెట్‌లో ఉండాల్సి వచ్చేదనీ త్రివిక్రమ్ తెలిపారు. ఎన్టీఆర్ టైమ్ పంక్చువ్యాలిటీ, స్పీడుతో టార్చర్ అనుభవించానని ఆయన అన్నారు. రోజుల్లో ఒక్క సన్నివేశం తీయాలని ప్లాన్ చేస్తే... ఎన్టీఆర్ స్పీడుకు మధ్యహ్నం లోపల పూర్తయ్యేదట! అందువల్ల, రెండో సన్నివేశానికి అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చేదని త్రివిక్రమ్ చెప్పారు. అందువల్ల, 100 రోజులు అనుకున్న షూటింగ్, 70 రోజుల్లో పూర్తయ్యిందని ఆయన పేర్కొన్నారు.