ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి 'ఆర్ఆర్ఆర్' టీమ్ షాక్
on May 18, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ మామూలు షాక్ ఇవ్వలేదు. మే 20న తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా వీడియో గ్లింప్స్ వస్తుందని ఎదురు చూసిన నందమూరి అభిమానుల గుండెల్లో బాంబు లాంటి వార్తను రాజమౌళి పేల్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజైన బుధవారం ఏమీ విడుదల చేయడం లేదని స్పష్టంగా చెప్పారు.
"లాక్ డౌన్ మరోసారి పొడిగించిన కారణంగా పనులన్నీ ఆగిపోయాయి. అయినప్పటికీ మేం మా శాయశక్తులా ప్రయత్నించాం. అయినా ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానులకు బహుమతిగా ఇవ్వాలనుకున్న గ్లింప్స్ వర్క్ పూర్తి చేయలేకపోయాము. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా వీడియో గ్లింప్స్ ఏదీ విడుదల చేయడం లేదు. ఏదో పేరు కోసం ఏదోకటి విడుదల చేయాలని మేం అనుకోవడం లేదు. మీ ఎదురుచూపులకు అర్థం ఉండేలా, ఎప్పుడు విడుదలైనా పండగ చేసుకొనేలా ఉంటుందని చెప్పగలం" అని 'ఆర్ఆర్ఆర్' టీమ్ ట్వీట్ చేసింది.
సో... ఎన్టీఆర్ పుట్టినరోజుకి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్ ఉందన్నమాట. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.