ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ చేయడానికి రెడీనా?
on May 15, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు రెడీగా ఉండండి... తారక్ పుట్టినరోజు మే 20న, అంతకు ముందు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడానికి! నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ లో ట్రెండ్స్ చేయడానికి!! ఎన్టీఆర్ అభిమానులు, దేశవ్యాప్తంగా తెలుగు సినిమాను అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం జక్కన్న రాజమౌళి గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. అదే 'ఆర్ఆర్ఆర్' టీజర్. ఆల్రెడీ షూటింగ్ చేసిన సన్నివేశాలతో ఆయన ఓ టీజర్ కట్ చేస్తున్నారు.
లాక్‌డౌన్ టైమ్‌లోనే రామ్ చరణ్ పుట్టినరోజు వచ్చింది. అప్పుడు 'ఆర్ఆర్ఆర్' నుండి అతడి బర్త్ డే టీజర్ విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డేకి కూడా రాజమౌళి టీజర్ విడుదల చేస్తారని ప్రేక్షకులందరూ భావించారు. నిజంగా ఆయన విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే మధ్యలో కొంచెం టెన్షన్ పెట్టారు. ఎన్టీఆర్ టీజర్ కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకటించాల్సి ఉందని, లాక్‌డౌన్ వల్ల కుదరడం లేదని ఆయన అన్నారు. దాంతో ఎన్టీఆర్ పుట్టినరోజుకి టీజర్ ఉండదనే అనుమానం కలిగించారు. వీటికి నిర్మాత దానయ్య తెర దించారు. ఎన్టీఆర్ పుట్టినరోజుకి రాజమౌళి ఏదో రెడీ చేస్తున్నారని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
