పోర్న్‌స్టార్ తర్వాత ఎన్టీఆర్‌దే బెస్ట్ బాడీ అంటున్నాడు!
on May 20, 2020
ప్రశంసల్లోనూ, విమర్శల్లోనూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి ఎవరికీ అంతు చిక్కదు. ప్రశంసిస్తూ విమర్శిస్తారో, విమర్శిస్తూ ప్రశంసిస్తారో తెలియదు. తికమకగా ఉంటుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతడి సిక్స్ ప్యాక్ స్టిల్ ఒకటి పర్సనల్ ట్రయినర్ లాయిడ్ స్టీవెన్స్ రిలీజ్ చేశాడు. మజిల్డ్ ఎన్టీఆర్ బాడీ ప్రేక్షకుల మతులు పోగొట్టింది. ఆ స్టిల్ మీద వర్మ తనదైన శైలిలో స్పందించాడు.
"హే ఎన్టీఆర్... నేను 'గే' కాదు అని నీకు బాగా తెలుసు. కానీ, ఈ ఫొటోలో నిన్ను చూసిన తర్వాత ఆల్మోస్ట్ 'గే'గా మారాలని అనుకున్నాను. ఆ బాడీ ఏంట్రా నాయనా" అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇందులో అభ్యంతరకమైన అంశం ఏమీ లేదు. ఈ ట్వీట్ కంటే ముందు ఆయన మరో ట్వీట్ చేశారు. అది మాత్రం అర్థం కాకుండా తికమకగా ఉంది. "మియా మాల్కోవా తర్వాత నేను చూసిన బెస్ట్ బాడీ ఇదే" అని వర్మ పేర్కొన్నాడు. పోర్న్ స్టార్ బాడీతో ఎన్టీఆర్ బాడీకి పోలిక ఏంటో మరి? అన్నట్టు మియా మాల్కోవాతో వర్మ తీసిన 'క్లైమాక్స్' ఈ నెలాఖరున విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
