హలో కాదు... సాహో సర్‌జీ!
on Oct 9, 2018
హలో... ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనల్లో కనిపించిన పిల్ల గుర్తుందా? అసలు పేరుతో కంటే ఎయిర్‌టెల్ పిల్లగానే పాపులర్ అయిన ఆ అమ్మాయి పేరు సాషా చెత్రీ! మొన్నటివరకూ వాణిజ్య ప్రకటనలతో బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మాయి త్వరలో వెండితెరపై సందడి చేయనుంది. ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి ఆహ్లాదకర చిత్రాలు అందించిన దర్శకుడు సాయికిరణ్ అడివి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’లో నటిస్తుందీ అమ్మడు. ఈ చిత్రం కంటే ముందు ఆమెకు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ... ఆచితూచి ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకుంది. మరీ ఇంత చిన్న చిత్రం చేస్తుందేంటని చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ అమ్మడికి తెలుగులో భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’లో ముఖ్య పాత్ర చేసే అవకాశం సాషా చెత్రీకి వచ్చిందనేది ఫిల్మ్‌నగర్ ఖబర్! ‘సాహో’లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సాషాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి వుంటారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఏ క్యారెక్టర్ చేసినా... సినిమా విడుదల తరవాత హిట్టైనా ఫ్లాపైనా ఆమెకు పేరొస్తుంది.