ఎన్టీఆర్ లేఖ వెనుక మర్మం అదేనా?
on May 19, 2020
'మా తారక్ అన్న ఈ సినిమా ఒప్పుకొని పెద్ద తప్పు చేశాడు' - ట్విట్టర్ లో ఒక ఎన్టీఆర్ భక్తుడి అభిప్రాయం! 1000% అంటూ అతనికి మరో అభిమాని నుండి మద్దతు!!
'చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే. రెండున్నర సంవత్సరాల బాధరా మాది. మీకు అర్థం కాదులే! ఇంట్లో కూర్చుని మా వాళ్ళు ఎడిట్ ఇరగ దీస్తున్నారు. కనీసం మీరు ఫస్ట్ లుక్ కూడా వదలడంలేదు ఓపిక చచ్చిపోయింది రా బాబు' - మరో ఎన్టీఆర్ అభిమాని ఆవేదన.
'రెండేళ్లు ఏం పీకారు సార్? 75% కంప్లీట్ అయిందన్నారు. ఇప్పుడు ఏమో లాక్ డౌన్ వల్ల అని సొల్లు చెప్పకండి' - ఇంకో అభిమాని ఆగ్రహం.
'అరే ఏంట్రా ఇలా అనేశారు? ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేరా? గొప్పోళ్ళ రా మీరు' - ఓ ప్రేక్షకుడు వెటకారం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి 'ఆర్ఆర్ఆర్' యూనిట్ నుండి ఫస్ట్ లుక్ లేదా టీజర్ బహుమతిగా వస్తుందని అభిమానులు ఆశించారు. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ అటువంటిది ఏమీ లేదని 'ఆర్ఆర్ఆర్' యూనిట్ అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహావేశాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి పడ్డాయి.
'ఆర్ఆర్ఆర్' యూనిట్ ఎందుకు ఫస్ట్ లుక్ విడుదల చేయలేకపోయారు అనే విషయంలో హీరోకి పూర్తి స్పష్టత ఉంది. ఆయనకు పరిస్థితులు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల తప్ప కావాలని చేసింది కాదు గనుక అభిమానులను కూల్ చేయడానికి ఎన్టీఆర్ ముందుకొచ్చారనీ, అభిమానులకు లేఖ రాశారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆయన రంగంలోకి రావడంతో చాలా మంది అభిమానులు కూల్ అయ్యారు. కొందరిలో మాత్రం నిరాశ అలాగే ఉంది. \