కమల్ తో నేను చెయ్యట్లేదు
on Feb 19, 2014
కమల్ హసన్ హీరోగా నటించనున్న "ఉత్తమ విలన్" చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై త్రిష స్పందిస్తూ... "ఇందులో నేను నటించడం లేదు. ఈ సినిమా కోసం నన్ను ఎవరు సంప్రదించలేరు" అని తెలిపింది. ఇప్పటికే ఈ చిత్రంలో కాజల్, తమన్నాలను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి కమల్ స్వయంగా కథను అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.