ప్రేమలో రానా... నలుగురి నోట త్రిష
on May 13, 2020
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో!? రానా ప్రేమ, పెళ్లి ప్రకటన చెన్నై సుందరి త్రిషకు చిక్కులు తీసుకొస్తోంది. ఆమె నలుగురి నోళ్లలో నానుతోంది. కొన్నాళ్ల క్రితం రానా, త్రిష ప్రేమలో ఉన్నారని ఫిలింనగర్ కోడై కూసింది. అందుకు తగ్గట్టు అప్పట్లో ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. అయితే ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని రానా కానీ, త్రిష కానీ చెప్పలేదు. మంచి స్నేహితులమని మాత్రమే చెప్పారు. అయినా ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని నలుగురు అనుకునేవారు. తర్వాత తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే అది పెళ్లి పీటల వరకు రాలేదు. మళ్లీ త్రిష సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు రానా పెళ్లికి రెడీ అవ్వడంతో 'పాపం త్రిష' అంటూ ఇంటర్‌నెట్‌లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. రానా, మిహీక బజాజ్ ఫొటో కింద 'నన్ను వదిలేస్తున్నావా?' అంటూ ఏడుస్తున్న త్రిష ఫోటో ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రానా ప్రేమ ప్రకటన ఏమో కానీ... నలుగురి నోట త్రిష మాట వినబడుతోంది. త్రిష హర్ట్ అయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. రానాకు త్రిష కంగ్రాట్స్ చెప్పకపోవడాన్నీ ప్రస్తావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
