బెదిరింపు కాల్స్..ప్రాణభయంలో త్రిష
on Jan 18, 2017
సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది చెన్నై చిన్నది త్రిష. తాజాగా జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించడంతో తమిళనాట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి జల్లికట్టును కొనసాగించాలని కోరుతుండటంతో తమిళనాడు వేడేక్కింది..సరిగ్గా ఇదే సమయంలో తాము జల్లికట్టుకు వ్యతిరేకమని..సంప్రదాయాల పేరిట మూగజీవాలను హింసించరాదంటూ పెటా సంస్థ పోరాటానికి దిగింది. ఇదే సమయంలో జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు పోస్ట్ అయ్యాయి..ఇంకేముంది త్రిష చాలామంది జల్లికట్లు మద్దతుదారులకు లక్ష్యంగా మారింది. ఆమె నటిస్తున్న "గర్జన్" సినిమా షూటింగ్‌పై ఆందోళనకారులు విరుచుకుపడి..త్రిషపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో తన కుమార్తెకు ప్రాణహాని ఉందని త్రిష తల్లి ఉమాకృష్ణన్ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని..పబ్లిషైన ట్విట్టు త్రిష పోస్ట్ చేసింది కావని అన్నారు. త్రిషను బెదిరిస్తూ, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని..తమ కుటుంబానికి పోలీసు భద్రత కల్పించాలని కోరారు. త్రిష పెటాలో సభ్యురాలు కాదని..ఎన్నడూ ఆ సంస్థ కోసం ప్రచారం చేయలేదని ఉమా ఫిర్యాదులో పేర్కొన్నారు. తామెన్నడూ జల్లికట్టుకు వ్యతిరేకం కాదని తమిళ సంప్రదాయాలకు తమ కుటుంబం మద్దతిస్తుందని వివరించారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
