పవన్ కళ్యాణ్ సినిమా అదికాదట
on Feb 19, 2014
పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలోనే "గబ్బర్ సింగ్ 2" చిత్రం తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ప్రముఖ నటుడు ఆలీ స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ తర్వాత చిత్రం "గబ్బర్ సింగ్ 2" అని అంటున్నారు కానీ టైటిల్ అది కాదు. కథ కూడా వేరు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి" అని అన్నారు. అంటే పవన్ గబ్బర్ సింగ్ పార్ట్ 2 లేనట్లే అని అనుకోవచ్చా లేదా అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.