త్రిష పెళ్లికి రెడీ!!
on Mar 16, 2019
ఒక్కొక్క హీరోయిన్ మెల్లగా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు త్రిష వంతొచ్చింది. తాజాగా తన పెళ్లిపై ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఓ నాలుగేళ్ల క్రితం ప్రేమలో పడి బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్ తో పెళ్లి వరకు వెళ్లింది ఈ భామ. నిశ్చితార్ధం కూడా అయిపోయిన తర్వాత పెళ్లి పెటాకులు చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా సంచలన సినిమాలు చేసింది త్రిష. ఇప్పుడు ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు. ఈ మధ్యే రజనీకాంత్ పేట సినిమాలో నటించింది త్రిష. ఈ సినిమాలతో తన లైఫ్ టైమ్ డ్రీమ్ పూర్తయిపోయిందంటుంది చైన్నై బ్యూటీ. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది త్రిష. ఎలాంటి వాడు కావాలి అంటూ అడిగితే సూటిగా సుత్తిలేకుండా సమాధానం చేప్పింది త్రిష. తనకు పెద్దగా అందగాడేమీ అవసరం లేదని. కేవలం తనను బాగా చూసుకునే వాడైతే చాలంటుంది త్రిష. అవసరం అనుకుంటే రేపే పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సరైన వాడు దొరకాలి కదా. లేకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాం అంటుంది ఈ బ్యూటీ. తనకు కాబోయే వాడు హీరోలా ఉండాలనే రిక్వైర్మెంట్ కూడా లేవని నిజానికి తన నలుపు అంటే ఇష్టమని చెబుతుంది త్రిష. కాబోయేవాడు నలుపు అయిన పర్లేదని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. పైగా ఇంట్లో చూపించిన వాన్ని మాత్రం ఛస్తే చేసుకోనని తెగేసి చెబుతుంది త్రిష. ప్రేమ వివాహమే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి త్రిష చెబుతున్నతీరు చూస్తుంటే ఇప్పటికే ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తుంది.