త్రిషకు అరవింద్‌స్వామితో ఛాన్స్.. కారణం ఆ పూజలేనా..?
on Jun 6, 2017
ఒకప్పుడు హీరోయిన్‌గా సౌత్‌ను ఒక ఊపింది త్రిష. కోలీవుడ్ టూ టాలీవుడ్ ఎక్కడ చూసినా..ఎవరి పక్కనైనా త్రిష ఉండాల్సిందే. అలాంటి త్రిషకు దురదృష్టం పట్టుకుంది. కొత్త అందాలు రావడం..వయసు పైబడుతుండటంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుదామనకుంది. ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. కానీ ఏం జరిగిందో..ఏంటో ఆ నిశ్చితార్థం రద్దయ్యింది. అయితే ఎవ్వరూ ఉహించని విధంగా తెలుగు, తమిళ సినిమాలో భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ వాటి వల్ల త్రిషకు పెద్దగా మేలు జరిగింది లేదు. తిరిగి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.
ఆఫర్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. బట్ నో ఛేంజ్. ఇక కెరీర్ అటకెక్కేసింది అనుకున్న తరుణంలో ఏకంగా ఆరు సినిమాలకు సైన్ చేసింది. రీసెంట్‌గా అరవింద్ స్వామితో సతురంగ వేట్టై-2లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇంత ఆకస్మాత్తుగా త్రిషకు అవకాశాలు రావడంపై కోలీవుడ్‌లో తెగ చెవులు కోరుక్కుంటున్నారు. దీనికంతటికి కారణం బాంకాక్‌లో పూజలు చేయడమేనంటోంది చెన్నై మీడియా. అత్యంత శక్తివంతమైన ఆ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగుతాయని త్రిషకు ఎవరో సలహా ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పూజలు చేసిందట. ఇక అంతే.. అదృష్టం మళ్లీ తలుపు తట్టిందట. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి త్రిష డైరీ ఫుల్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
