జీఎస్టీ ఎందుకు తీశారు.. వర్మకి పోలీసుల పది ప్రశ్నలు
on Feb 17, 2018
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టీ దేశవ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ సినిమాలో చూపించిన అశ్లీలత పరిధి దాటిందని.. మహిళల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు చిత్రీకరించారని.. మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. ఇది చాలదు అన్నట్లు ఒక మీడియా సంస్థ లైవ్ షోలో పాల్గొన్న వర్మ.. ఒక సామాజిక కార్యకర్తతో అసభ్యకరంగా మాట్లాడటంతో రచ్చ రచ్చ అయ్యింది. దీనిపై మహిళా సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపడంతో.. ఆర్జీవీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మపై పది ప్రశ్నలు వదలగా... ఎప్పటిలాగే తనదైన శైలిలో సమాధానం చెప్పాడు ఈ సెన్షేషనల్ డైరెక్టర్. ఆ పది ప్రశ్నలు ఏంటంటే
1. జీఎస్టీని ఎందుకు తీశారు...?
2. మియా మాల్కావాతో సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది..?
3. ఈ సినిమాకు పెట్టుబడి ఎక్కడిది.. పెట్టుబడి పెట్టిన వారెవరు..?
4. ఈ సినిమాకు పనిచేసిన వారికి ఏ విధంగా చెల్లింపులు చేశారు..?
5. సినిమాను ఎక్కడ తీశారు..? ఎక్కడ అప్‌లోడ్ చేశారు..?
6. మీ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోని మాల్కోవా ఫోటోలు ఎక్కడివి..?
7. ఒక మహిళ మీద అభ్యంతరకరంగా చేసిన కామెంట్‌పై మీ అభిప్రాయం..?
8. భారతీయ చట్టాలకు జీఎస్టీ సినిమా వర్తించదు అంటున్నారు.. అందుకు తగిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా.?
9. విమియో వెబ్‌సైట్‌కి ఈ సినిమాను ఎంత ధరకు అమ్మారు..?
10. ఈ సినిమాకు వాడిన ఎక్విప్‌మెంట్ ఎక్కడిది..?