రివైజింగ్ కమీటీలో ఆర్జీవీ గట్టెక్కాడు!
on Dec 9, 2019
మొత్తానికి రాంగోపాల్ వర్మ గట్టెక్కాడు. తన సినిమాలతో ఎవరెవరినో ఇబ్బందులు పెడుతూ వచ్చే ఆయనకు సెన్సార్ బోర్డు చుక్కలు చూపిస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఆయన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా కాస్తా సెన్సార్ బోర్డు వల్ల 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా మారిపోయింది. పైగా నవంబర్ 29న రిలీజ్ చెయ్యడానికి ఆయన వేసుకున్న ప్లాన్‌ని కూడా అది డిస్టర్బ్ చేసింది. ఆ మూవీని రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసింది. ఎట్టకేలకు రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో సినిమాకి 'యు/ఎ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దాంతో డిసెంబర్ 12న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ తాతోలుతో కలిసి ఈ మూవీని ఆయన డైరెక్ట్ చేశాడు.
"ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంతో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ మూవీ" అని మూవీ యూనిట్ ఒకప్రకటనలో తెలిపింది. ఇందులోని పాటల్లో ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని కూడా అది తెలిపింది. మరి చూద్దాం.. ప్రేక్షకులు 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'ను ఏ రీతిలో ఆదరిస్తారో!
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
