అరవింద రాదు... రాలేదు!
on Oct 6, 2018
'అరవింద సమేత వీరరాఘవ'... ఈ టైటిల్ ద్వారా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఎంత ప్రాముఖ్యత వుందో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పకనే చెప్పాడు. 'ఓ మగాడి పక్కన ఆడది వుండటం కంటే బలం ఏముంది?' - తన ఇమేజ్‌కి టైటిల్ సరితూగుతుందా? అని ప్రేక్షకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన ఆన్సర్. అయితే అరవింద పాత్రలో నటించిన పూజా హెగ్డే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పక్కన కనిపించలేదు. బాలీవుడ్ మూవీ 'హౌస్‌ఫుల్-4' షూటింగ్ వుండడటంతో హైదరాబాద్ రాకుండా హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు పబ్లిసిటీకి కూడా రాకుండా హ్యాండ్ ఇస్తుందని టాక్. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించిన 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ పూజా హెగ్డే క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంది. అటువంటి క్యారెక్టర్‌లో నటించిన పూజా హెగ్డేకి పబ్లిసిటీ చేయడం ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్పక్కర్లేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్‌లో 'హౌస్‌ఫుల్-4' షూటింగ్ వల్ల రాలేకపోయింది. విడుదలకు ప్రభాస్ సినిమా షూటింగ్ కోసమని ఇటలీ వెళ్లడంతో ఇక్కడ అందుబాటులో వుండటం లేదు. గోపిచంద్ హీరోగా 'జిల్' తీసిన రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అందులో పూజా హెగ్డే హీరోయిన్. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అందుకని 'అరవింద సమేత వీరరాఘవ' పబ్లిసిటీ కార్యక్రమాలకు పూజా హెగ్డే రావడం లేదు. రాదు... రాలేదు కూడా!!
Also Read