వాట్ ఏ న్యూస్..అరవింద సమేతలో అభయ్ రామ్ నటించాడట.!!
on Oct 5, 2018
అరవింద సమేత వీర రాఘవ.. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడం.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులైతే ఈ సినిమా వంద కోట్లు షేర్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఒకవైపు విడుదలకు సిద్దమైన అరవింద సమేత గురించి ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసే వార్త ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ నటించాడట. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో అభయ్ త్రివిక్రమ్ ఒడిలో కూర్చొని కత్తి పట్టుకొని కనిపించాడు. అదిచూసి అభిమానులు పండగ చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమాలో అభయ్ నటించాడంటే వారి ఆనందానికి అవధులు ఉంటాయా. అరవింద సమేతలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో అభయ్ కనిపిస్తాడట. అభిమానులను థియేటర్లో సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని సీక్రెట్ గా ఉంచారట. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ ఇదే జరిగితే అభిమానులకు పండగనే చెప్పాలి.