పవన్ కల్యాణ్ లుక్ అఫిషియల్‌గా వస్తోంది!
on Mar 1, 2020
బాలీవుడ్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌లో లాయర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తోన్న పవన్ కల్యాణ్ లుక్ సోమవారం అంటే మార్చి 2న వెల్లడి కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం విడుదల చేసిన ప్రి లుక్‌లో నిర్మాత దిల్ రాజు తెలిపారు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఈ 26వ సినిమా టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫిల్మ్ చాంబర్‌లో 'వకీల్ సాబ్' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఉగాది రోజున టైటిల్‌ను అనౌన్స్ చేస్తామని దిల్ రాజు గతంలో తెలిపారు. కాగా ఆదివారం విడుదల చేసిన ప్రి లుక్‌లో పవన్ కల్యాణ్ ఫుల్ సైజ్ లుక్‌ను షాడోలో చూపారు. అది ఇదివరకే లీక్ అయిన లుక్ కావడం గమనార్హం. దాంతో పాటు లాయర్లు వాడే 'టై'ను కూడా ప్రి లుక్‌లో చూపారు.
'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల స్నేహితురాళ్లుగా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వాళ్ల తరపున కోర్టులో వాదించే లాయర్‌గా పవన్ కల్యాణ్ కనిపిస్తారు. 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ కావడంలో కీలక బాధ్యతలు వహించిన సంగీత దర్శకుడు తమన్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. మే 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read