పవన్ కళ్యాణ్ ఫస్ట్... 14 రీల్స్ ప్లస్ నెక్స్ట్!
on May 19, 2020
బండ్ల గణేష్ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం కోసం అన్నట్లు ప్లస్ నిర్మాతల చేత సినిమా అనౌన్స్ చేయించాడో? లేదా లాక్ డౌన్ సమయంలో కొత్త కథ చెప్పి ఒప్పించాడో? మొత్తానికి దర్శకుడు హరీష్ శంకర్ మరో సినిమా ప్రకటించాడు. కరోనా కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడీ దర్శకుడు. ఇకపై హరీష్ శంకర్ తో సినిమాలు తీయనని బండ్ల గణేష్ ప్రకటించిన మరుక్షణమే... దర్శకుడికి మద్దతుగా పివిపి వచ్చారు. తర్వాత సంస్థలో 'గద్దల కొండ గణేష్' వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా నటులు నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రకటించారు. ఈ ప్రకటన బోలెడు సందేహాలకు తావిచ్చింది.
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగతేంటి అనే సందేహాలు వచ్చాయి కొందరికి. పవన్ సినిమా పక్కనపెట్టి హరీష్ మరో సినిమా టేకప్ చేస్తున్నాడా? అని గుసగుసలు వినిపించాయి. పవన్ అభిమానులు అయితే ఏకంగా ట్విట్టర్ లో హరీష్ శంకర్ ని ముందు పవన్ కళ్యాణ్ సినిమా చేయమని అడిగారు. "పవన్ కళ్యాణ్ సినిమా కథ సంగీత చర్చలు జరుగుతున్నాయనీ, ఇప్పుడు అంగీకరించిన కొత్త సినిమా ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమా తర్వాతే" అని హరీష్ శంకర్ స్పష్టత ఇచ్చారు. సో... పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్, 14 రీల్స్ ప్లస్ సినిమా నెక్స్ట్ అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
