'వకీల్ సాబ్'... అంతకుమించి!
on Mar 16, 2020
ప్రజెంట్ పవర్ స్టార్ సినిమా గురించే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్కువ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'కి ఈ యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పవన్ సినిమాకి వర్క్ ఛాన్స్ రావడంతో కాన్సెంట్రేషన్ గట్టిగా పెట్టాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన 'మగువా మగువా' సాంగ్ మాంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. మిగతా సాంగ్స్ మీద అంచనాలు పెంచింది. పాటలే కాదు... నేపథ్య సంగీతం మీద కూడా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.
"టీవీలో 'అరవింద సమేత వీర రాఘవ' చూస్తున్నా. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్. ప్రతి సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేశాడు. 'వకీల్ సాబ్'కి కూడా ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం" అని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. దానికి తమన్ రిప్లై ఇచ్చారు. అంతకంటే భారీగా ఇస్తానని చెప్పారు. "ఇట్ విల్ బి మచ్ బిగ్గర్" అని తెలిపారు. 'అరవింద సమేత వీర రాఘవ'లో నేపథ్య సంగీతాన్ని మించి 'వకీల్ సాబ్' నేపథ్య సంగీతం ఉంటుందన్నమాట. సినిమాలో పవన్ కొత్త స్టిల్ కూడా తమన్ ట్వీట్ చేశారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
