ఎన్టీఆర్ చేయలేనిది బన్నీ చేశాడు!
on Mar 23, 2015
కొన్ని కొన్ని పాత్రలపై కొంతమందికి మోజు. `ఆ పాత్ర ఎలాగైనా చేయాలి` అనుకొంటారు. చివరికి మరో హీరోకి ఆ అవకాశం దక్కుతుంది. గోనగన్నారెడ్డి పాత్ర కూడా అంతే! కాకతీయుల చరిత్రలో గోనగన్నారెడ్డిది ఓ అధ్యాయం. గన్నారెడ్డి వీరత్వం గురించి కథలు కథలుగా చెబుతారు. అందుకే చాలామంది కథానాయకులు ఈ పాత్ర చేయాలని ఉబలాట పడ్డారట. మరీ ముఖ్యంగా నందమూరి హీరోలు ఈ పాత్ర పోషించాలని కలలుకన్నారు. అప్పటి నందమూరి తారకరామారావు, బాలకృష్ణ, ఆఖరికి ఎన్టీఆర్ కూడా గోనగన్నారెడ్డి పాత్రని చేయాలనుకొన్నారట. అయితే ఆ అవకాశం... అల్లు అర్జున్‌కి దక్కింది. రుద్రమదేవిలో బన్నీ ఈ పాత్ర పోషించాడు. గన్నారెడ్డిగా బన్నీ లుక్స్.. అదిరిపోయాయి. రుద్రమదేవిగా అనుష్క, గన్నారెడ్డిగా బన్నీలే తన సినిమాని నిలబెడతారని గుణశేఖర్ ఆశలు పెట్టుకొన్నాడు. గన్నారెడ్డి పాత్రలో బన్నీ... పెర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందట. నందమూరి హీరోలు ప్రయత్నించి సాధించలేకపోయిన పాత్రలో ఈ మెగా హీరో ఎలా మెప్పిస్తాడో వెయిట్ అండ్ సీ.