మీడియాపై త్రిష ఫైర్
on Mar 20, 2015
పెళ్లయ్యాక కూడా సినిమా రంగంలో కొనసాగాలనుకొంటోంది త్రిష. అందుకే నటనకు దూరమవ్వబోవడం లేదన్న సంకేతాల్ని పరిశ్రమకు పంపింది. ``పెళ్లయ్యాక మీరు నటిస్తారా? సినిమాలకు దూరంగా ఉంటారా? అని మీడియాలో నన్ను చాలామంది అడుగుతున్నారు. అసలు ఇలాంటి ప్రశ్న కథానాయికకే ఎందుకు ఎదురవుతుందో నాకు అర్థం కాదు. ఈ ప్రశ్న హీరోలను అడగ్గలరా? పెళ్లయ్యాక కూడా నటించే సౌలభ్యం వాళ్లకే ఉందా..?`` అంటూ మండిపడుతోంది. ``నేను నటనని ఆస్వాదిస్తున్నా. నా కెరీర్ తొలిరోజుల్లో సెట్స్‌లో ఎంత కిక్కు లభించేదో.. ఇప్పటికే అంతే కిక్కు దొరుకుతోంది. పదేళ్ల కాలంలో సినిమాలపై ఓ అవగాహన పెంచుకొన్నా. దాంతో పాటు ప్రేమ పెరిగింది. సడన్‌గా సినిమాల్ని వదల్లేను`` అంది. దమ్ము సినిమా ముందు కూడా త్రిష ఇలానే మాట్లాడింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక.. తెలుగులో అవకాశాలు రాలేదు. ఇప్పుడు లయన్‌తో మళ్లీ కాస్త ఆత్మవిశ్వాసం తెచ్చుకొంది. ఈసినిమా హిట్టయితేనే త్రిషకు ఇక్కడ ఆఫర్లు వస్తాయి. లేదంటే.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. ఆ సంగతి అమ్మడికి అర్థం కావడం లేదు.