దర్శకుడు భార్య... కథానాయకుడు భర్త!
on Oct 8, 2018
ఓ చిత్రానికి దర్శకుడు, కథానాయకుడు భార్యాభర్తల్లాంటివారు అని యువ కథానాయకుడు ఎన్టీఆర్ చెప్పారు. ఆయన నటించిన తాజా సినిమా ‘ఆరవింద సమేత వీరరాఘవ’. చిత్రదర్శకుడు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ బంధం మరింత బలపడిందని మెన్న జరిగిన వేడుకలో ఆయన మాటల్ని గమనిస్తే అర్థమవుతోంది. ‘త్రివిక్రమ్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్టున్నారు?’ అని ఎన్టీఆర్‌ని అడిగితే... ‘‘నా అభిప్రాయంలో దర్శకుడు, కథానాయకుడు భార్యాభర్తల్లాంటివారు’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కథానాయకుడికి, నటుడికి తొలి ప్రేక్షకుడు ఎప్పుడూ దర్శకుడే. ఎందుకంటే.. దర్శకుడి ఊహల నుంచి కథ పుడుతుంది. అప్పటివరకూ తను రాసిన కథకు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేది నటుడు. కథ రాసింది దర్శకుడు అయినా... తెరపై కనిపించేది నటుడే కదా! అందుకని, నటుడు ముందు సంతృప్తి పరచాల్సింది దర్శకుణ్ణి’’ అన్నారు. ఇప్పటివరకూ పని చేసిన దర్శకులందరితో తనకు సత్సంబంధాలు వున్నాయని ఎన్టీఆర్ చెప్పారు. చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా ప్రయాణాన్ని, ఓ చిత్రానికి పని చేసే విధానాన్ని ఆస్వాదిస్తానని ఆయన తెలిపారు.