మహేష్ దర్శకత్వంలో అనుష్క?
on Mar 14, 2020
మహేష్ అంటే సూపర్‌స్టార్ మహేష్‌బాబు అనుకునేరు... ఆయన కాదు. మహేష్ అని దర్శకుడు ఉన్నాడు. ఆరేళ్ళ క్రితం సందీప్ కిషన్, రెజీనా జంటగా 'రా రా కృష్ణయ్య' అని ఒక సినిమా తీశాడు. హీరో అన్న, వదిన పాత్రల్లో జగపతిబాబు, కళ్యాణి నటించారు. అప్పట్లో మోస్తరుగా ఆడింది. తర్వాత అతడికి అవకాశాలు రాలేదు. ఆ మహేష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అనుష్క ఆసక్తిగా ఉన్నారట. కథ నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా అనుష్క సినిమాలు చేస్తారు. ఎగ్జాంపుల్‌కి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న 'నిశ్శబ్దం'ను తీసుకోండి. దర్శకుడు హేమంత్ మధుకర్ సినిమా తీసి చాలా రోజులైంది. కానీ, అతడికి అనుష్క అవకాశం ఇచ్చారు. అలాగే, మహేష్‌కి అవకాశం ఇస్తున్నారట. అతడు దర్శకుడిగా సినిమా తీసి ఆరేళ్ళు అయినప్పటికీ మంచి కథ చెప్పడంతో సినిమా చేయడానికి సరే అన్నారట. 'నిశ్శబ్దం' విడుదల తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
