ప్రభాస్ నా కొడుకు: అనుష్క
on Mar 18, 2020
ఒకటి... ప్రభాస్‌తో ఫ్రెండ్షిప్!
రెండు... సినిమాల్లో యాక్టింగ్!
ఈ రెండిటిలో ఏదో ఒక పని చేయడం మానేయమంటే మీరు ఏది మానేస్తారు?
- స్వీటీ అలియాస్ అనుష్కకు ఈ ప్రశ్న ఎదురైంది. ఎక్కడంటే? సుమ యాంకరింగ్ చేస్తున్న 'క్యాష్' ప్రోగ్రామ్ లో! ప్రశ్న అడిగిన తర్వాత ఆన్సర్ చెప్పవద్దని సుమ అన్నారు. కానీ, అనుష్క చెబుతానని మరీ చెప్పారు.
"డెఫనెట్‌గా సినిమాల్లో యాక్టింగ్ చేయడం మానేస్తా. సినిమాల కోసం నేను ఫ్రెండ్షిప్ వదిలేయను" అని అనుష్క చెప్పారు. అవసరమైతే సినిమాలు మానేస్తారు కానీ ప్రభాస్‌తో ఫ్రెండ్షిప్ కాదన్నమాట. ఇదే షోలో ప్రభాస్ తన కొడుకు అని అనుష్క అన్నారు. బహుశా... పుకార్లకు చెక్ పెట్టడానికి ఏమో!
ప్రభాస్ ఫొటో చూపించిన సుమ 'పాజిటివ్ విషయాలు చెప్పండి' అని అడిగారు. వెంటనే అనుష్క 'నా కొడుకు గురించా?' అన్నారు. అంటే... 'బాహుబలి'లో ప్రభాస్ రెండు పాత్రలు చేశారు. ఒకటి అమరేంద్ర బాహుబలి. మరొకటి మహేంద్ర బాహుబలి (శివుడు). అనుష్క పోషించిన దేవసేన పాత్రకు మహేంద్ర బాహుబలి కొడుకు. ఆమె అలా వచ్చారన్నమాట.
'సరే మీ కొడుకు గురించి చెప్పండి?' అని సుమ అడిగారు. "మనుషులంటే చాలా చాలా ఇష్టం" అని అనుష్క సమాధానం ఇచ్చారు. 'మీ ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నట్టు ఉన్నాయి?' అని సుమ మరో ప్రశ్న అడిగారు. ఏమాత్రం తడుముకోకుండా 'నా కొడుకు కదా!' అన్నారు అనుష్క. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమంటే... కొడుక్కి తండ్రి లక్షణాలు వచ్చాయని అన్నారు. అనుష్క చాలా తెలివిగా సమాధానాలు చెప్పారు.
ఇటీవల ఇంటర్వ్యూలలో తెల్లవారుజామున మూడింటికి కూడా తాను ఫోన్ చేయగల ఫ్రెండ్ ప్రభాస్ అని అనుష్క చెప్పిన సంగతి తెలిసిందే. అయితే... ప్రభాస్, అనుష్క మధ్య సంథింగ్ సంథింగ్ లవ్ అనీ, పెళ్లి పీటలు ఎక్కుతారని కొన్నిసార్లు వార్తలు వచ్చాయి. వాటికి ఇక చెక్ పడవచ్చు. అదీ సంగతి.