ENGLISH | TELUGU  

అనుష్క ప్రేమకథ అప్పుడు ముగిసింది

on Mar 16, 2020

వ్యక్తిగత విషయాల గురించి అనుష్క ఎప్పుడు ఓపెన్ అవ్వదు. పెళ్లి పుకార్లు వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తుందంతే! అయితే... ఎప్పుడూ ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై పెదవి విప్పలేదు. తొలిసారి తాను ఒక్కసారి ప్రేమించిన విషయాన్ని బయటకు చెప్పింది. సినీ పరిశ్రమలోకి వచ్చి 15 ఏళ్లు అయిన సందర్భంగా ప్రింట్ మీడియాకి అనుష్క స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఒక ఇంటర్వ్యూలో గతంలో తాను రిలేషన్షిప్ లో ఉండేదాన్ని అని ఆమె చెప్పింది. 

"అతనెవరో చెప్పలేను. ఎందుకంటే... అది నా వ్యక్తిగతం. కానీ, ఒక్కటి చెప్పగలను. 2008 సమయంలో నేను అందమైన రిలేషన్షిప్ లో ఉండేదాన్ని. ఇప్పటికీ మేము ఇద్దరం కలిసి ఉంటే అతనెవరో చెప్పేదాన్ని" అని అనుష్క స్పష్టం చేసింది. విడిపోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పలేదు గానీ... ఇప్పుడు తామిద్దరం కలిసి లేమని మాత్రం ఆమె చెప్పింది. "విడిపోవాలని నిర్ణయం మేమిద్దరం తీసుకున్నాం. ఇప్పటికీ అతనంటే నాకు గౌరవమే" అని అనుష్క వివరించింది.

రీసెంట్ గా ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. తర్వాత ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. వీటిని ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. పెళ్లి మీద తనకు గౌరవం, నమ్మకం ఉన్నాయని... తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటానని... పెళ్లి విషయం దాచాల్సిన అవసరం తనకు లేదని అనుష్క వివరించింది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.