రాజమౌళి జంపు జిలానీనా?
on May 21, 2015
బాహుబలి ఇప్పుడు అంతర్జాతీయ ప్రాజెక్టు అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. ఆఖరికి బాలీవుడ్ ప్రముఖులకూ బాహుబలే హాట్ టాపిక్కు. రాజమౌళి కూడా చాలా ప్లాన్ ప్రకారం ఈ సినిమాకి కావల్సిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ చేయించుకొంటున్నాడు... అదీ ఫ్రీగా! ఈ సినిమా గురించి విదేశీ మీడియా కూడా మాట్లాడుకొంటోంది. మొత్తానికి ఈ సినిమాతో జక్కన్న రేంజు అమాంతం పెరిగిపోయింది. ఇంకా తెలుగులోనే ఎంత కాలం సినిమాలు.??? అనుకొన్నాడో ఏమో, ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి పెట్టాడు. బాహుబలిని బాలీవుడ్‌లో కరణ్‌జోహార్ విడుదల చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో కొంత భాగం చూసిన కరణ్.. రాజమౌళి టేకింగ్‌కీ విజువలైజేషన్‌కీ ముగ్థుడైపోయాడట. దాంతో `మీరు నాతో డైరెక్టుగా ఓ హిందీ సినిమా చేయాలి..` అని మాట ఇచ్చేసుకొన్నాడట. అంతేకాదు... మరో బాలీవుడ్ నిర్మాత కూడా రాజమౌళితో అగ్రిమెంట్ కుదుర్చుకొన్నాడన్నది లేటెస్ట్ టాక్. అంటే బాలీవుడ్‌లో రాజమౌళి రెండు సినిమాలు చేయాలన్నమాట. `బాహుబలి` తరవాత అర్జెంటుగా చేయాల్సిన సినిమా కరణ్‌జోహార్‌దే. తెలుగు సినిమానే రెండేళ్లు తీసే రాజమౌళి.. బాలీవుడ్ సినిమాని మూడేళ్లయినా తీస్తాడు. రెండు సినిమాలకూ రమారమీ ఐదేళ్ల వరకూ వేసుకొన్నా - కొన్నాళ్లపాటు రాజమౌళి తెలుగువాళ్లకు కనిపించడన్నమాట.