యుద్దరంగంలో 'భల్లాలదేవ'
on May 20, 2015
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న‘బాహుబలి’ చిత్రంలో దగ్గుబాటి రానా భల్లలదేవా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్ ను కొన్ని నెలల క్రితమే విడుదల చేసారు. అయితే గతకొద్ది రోజులుగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా... ఈ సినిమాలో నటించిన ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు రాజమౌళి. లేటెస్ట్ గా భల్లలదేవా పాత్రకు సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. యుద్ధరంగంలోకి దిగి రౌద్రంతో కనిపిస్తున్నాడు. రానా బాడీ, లుక్స్ సూపర్బ్ గా వున్నాయి. ఈ ఫోటోతో రానా పాత్ర ఎలా వుండబోతుందోనని, ప్రభాస్, రానాల మధ్య ఎలాంటి సన్నీవేశాలు వుండనున్నాయోనని అభిమానుల్లో మరింత ఆతృత మొదలయ్యింది.