అఫీషియల్: సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' విడుదల కాదు!
on May 15, 2020
'ఆర్ఆర్ఆర్' విడుదల మరోసారి వాయిదా పడింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదల కావడం లేదు. ఆల్రెడీ ఈ సంగతి తెలిసిందే. లేటెస్టుగా నిర్మాత డీవీవీ దానయ్య నోటి నుండి బయటకు వచ్చింది. "సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడం అసాధ్యం" అని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతానికి 70 శాతం చిత్రీకరణ పూర్తయిందనీ, అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని ఆయన తెలిపారు.
కరోనా కాటు వేయడంతో ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం సినిమా షూటింగ్స్ ఏవీ జరగడం లేదు. అందుకు 'ఆర్ఆర్ఆర్' ఏమీ అతీతం కాదు. అసలే పెద్ద సినిమా. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమా. అరకొరగా షూటింగ్ చేసి రిలీజ్ చేయడం వీలయ్యే పని కాదు. అందుకని, సంక్రాంతికి రాకూడదని డిసైడ్ అయ్యారు. సంక్రాంతి కంటే ముందు ఈ ఏడాది జూలై 31న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే రిలీజ్ డేట్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఈ ఇయర్ జూలై 31 కాదు... నెక్స్ట్ ఇయర్ జూలై 31. అయితే, షూటింగులు స్టార్ట్ కావడం మీద అది ఆధారపడి ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
