ఎన్టీఆర్ బర్త్‌డేకి 'ఆర్ఆర్ఆర్' టీజర్ డౌటే
on Apr 24, 2020
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజున మెగా అభిమానులు, ప్రేక్షకులకు రాజమౌళి మంచి గిఫ్ట్ ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరారాజు పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. మరి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు ఎవరైనా చాలా సులభంగా సమాధానం చెప్పగలరు. 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరమ్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తారని! రాజమౌళి ఆలోచన కూడా అదే. రామ్ చరణ్ టీజర్‌కి ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించారు. ఎన్టీఆర్ టీజర్‌కి రామ్‌చరణ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకుంటున్నారు. అయితే... పుట్టినరోజు సమయానికి టీజర్ రెడీ అవుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం ఎవరూ చెప్పలేని పరిస్థితి.
మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే. దగ్గర దగ్గర ఇంకా నెల రోజుల టైమ్ ఉంది. మామూలు రోజుల్లో అయితే టీజర్ రెడీ చేయడానికి ఈ టైమ్ ఎక్కువ. కానీ, ప్రస్తుతం పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ లేవు. లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని విజువల్స్ షూట్ చేయాలి. స్వయంగా రాజమౌళి ఈ మాట చెప్పారు. లాక్ డౌన్ తర్వాత ఎలాంటి అనుమతులు లభిస్తాయనేది చూసి విజువల్స్ షూట్ చేయాలని దర్శక ధీరుడు అంటున్నారు. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే... ఆ విజువల్స్ షూట్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు ఆల్రెడీ షూట్ చేసిన విజువల్స్ తో టీజర్ రెడీ చేయాల్సి ఉంటుంది. మరి, లాక్ డౌన్ పొడిగిస్తే రాజమౌళి రాజీపడతారా? లేదంటే టీజర్ విడుదల చేయడం ఆపేస్తారా? వెయిట్ అండ్ వాచ్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
