మహేష్ కి సమంత ఎందుకు థాంక్స్ చెప్పిందంటే?
on Jun 1, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబుకి సమంత థాంక్స్ చెప్పారు. ఎందుకో తెలుసా? అది తెలుసుకునే ముందు మహేష్ ఏం చేశారో తెలుసుకోవాలి. తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా, తన కొత్త సినిమా 'సర్కారు వారి పాట' ప్రకటించిన తరుణంలో ఆదివారం సాయంత్రం ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో మహేష్ కాసేపు చాటింగ్ చేశారు. అప్పుడు ఒక ప్రేక్షకుడు హీరోని కాస్త ఇబ్బందుల్లో పెట్టే క్వశ్చన్ అడిగాడు.
"మీకు సమంత ఇష్టమా? రష్మిక ఇష్టమా? ఇద్దరిలో ఎవరు అంటే ఇష్టం?" అనే ప్రశ్న మహేష్ బాబుకి ఏదురైంది. 'దూకుడు'లో మహేష్ సరసన నటించారు. సంక్రాంతి హిట్ 'సరిలేరు నీకెవ్వరు'లో ఆయన సరసన రష్మిక నటించారు. రెండు కమర్షియల్ హిట్స్. ఇద్దరితోనూ మహేష్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఎవరిని నొప్పించకుండా మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. "ఇద్దరూ అమేజింగ్ కో-స్టార్స్. ఇద్దరూ నాకు నచ్చారు" అని మహేష్ అన్నారు. అందుకని, సమంత థాంక్స్ చెప్పారు.