విజయ్ దేవరకొండకు అండగా...
on May 5, 2020
విజయ్ దేవరకొండకు హీరోలు మహేష్ బాబు, రవితేజ, రానా దగ్గుబాటి నుండి మద్దతు లభించింది. వాళ్లు మాత్రమే కాదు... దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బీవీఎస్ రవి, నిర్మాత అనిల్ సుంకర, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ, యువ హీరోలు అల్లరి నరేష్, కార్తికేయ గుమ్మకొండ అతడికి అండగా నిలిచారు. తనపై దుష్ప్రచారం చేసిన ఒక వెబ్ మీడియా (తెలుగువన్ కాదు)పై సోమవారం సాయంత్రం విజయ్ దేవరకొండ మండిపడ్డారు. ఆ వెబ్ మీడియా సృష్టిస్తున్న వదంతుల వల్ల చిత్ర పరిశ్రమ ఎక్కువ బాధపడుతోందని, ఇన్నాళ్లూ క్షమించానని, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. తన విరాళాలు అడగడానికి వాళ్లెవరని ప్రశ్నించారు.
తనకు ప్రతి వెబ్‌సైట్‌తో సమస్య లేదనీ, నిజాయతీగా పని చేసే వెబ్‌సైట్‌లు, రైటర్లు తనకు తెలుసునని విజయ్ దేవరకొండ అన్నారు. వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాని ఆయన అన్నారు.
విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీ నుండి బలమైన మద్దతు లభిస్తోంది. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్ సైట్స్ హ్యాష్ ట్యాగులు ట్రేండింగులో నిలిచాయి. ఏదైనా వార్త రాసేటప్పుడు జర్నలిస్టులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని అనిల్ సుంకర అభిప్రాయపడ్డారు. జర్నలిజం సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండాలనీ, దురదృష్టవశాతూ విజయ్ దేవరకొండ చెప్పినట్టు ఒకరు బ్లాక్ మెయిల్ చేసేలా మారిందని బీవీఎస్ రవి అన్నారు. అందరూ ఒక్కటిగా నిలబడాల్సిన సమయం వచ్చిందని అనిల్ రావిపూడి అన్నారు. విజయ్ దేవరకొండను చాలా బాగా మాట్లాడవని రానా అభినందించారు. ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన సమయం ఇదని రవితేజ అన్నారు. ఇంకా పలువురు విజయ్ దేవరకొండకు తమ మద్దతు తెలిపారు.