సునీల్ కు గ్రీన్ సిగ్నలిచ్చిన సమంత..!
on Dec 6, 2013
సమంతకు ఇప్పటివరకు చిన్మయి తన గొంతును అరువిచ్చింది. త్వరలోనే సమంత తనకు తానుగా డబ్బింగ్ చెప్పుకుంటాను అని ఇటీవలే చెప్పింది. అయితే ప్రస్తుతం ఆమెకు మరో ఆఫర్ వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న "భీమవరం బుల్లోడు" చిత్రం ప్రమోషన్ సాంగ్ ను సమంతతో పాడించాలని ఈ చిత్ర నిర్మాత సమంతను అడిగాడని తెలిసింది. దాంతో సమంత కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. త్వరలోనే ఈ పాటను సమంత పాడనున్నది. మరి ఈ పాట ఈ సినిమాకు ఎలాంటి ప్లస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకు అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.