కొత్త జీవితాన్ని ట్రాక్‌లోకి తెచ్చుకుందాం: మహేశ్
on May 22, 2020
శుక్రవారం నుంచి తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. కోవిడ్-19 వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న రిస్క్‌లను డిస్కస్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నాగార్జున, రాజమౌళి సహా పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. శుక్రవారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవడంతో సూపర్ స్టార్ మహేశ్ సూపర్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పని చేయాలని సోషల్ మీడియాలో షేర్ చేసిన మెసేజ్‌లో ఆయన సూచించాడు.
"We are opening up. నెమ్మదిగా, కానీ కచ్చితంగా. ఇలాంటి టైమ్‌లో మాస్క్‌లనేవి తప్పనిసరి. మీరు బయటకు అడుగు పెట్టిన ప్రతిసారీ మాస్క్ ధరించాలి. మనల్ని మనం కాపాడుకోడానికీ, ఇతరుల్ని కాపాడ్డానికీ అది మనం తీసుకొనే కనీస జాగ్రత్త. చూడ్డానికి అది ఆడ్‌గా కనిపించవచ్చు, కానీ ఈ సమయంలో అది అవసరం. కచ్చితంగా దాన్ని మనం ఉపయోగిస్తుండాలి. కొత్త సాధారణ జీవితాన్ని అడాప్ట్ చేసుకొని, ఆ జీవితాన్ని ట్రాక్‌లోకి తెచ్చుకోవాలి. మాస్క్ వేసుకోవడం బాగుంటుంది. నేను వేసుకుంటున్నాను. మీరు?" అని ఆయన ట్వీట్ చేశారు.
గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, వి.వి. వినాయక్, ఎన్. శంకర్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, దిల్ రాజు, జెమిని కిరణ్, ఎం. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. టాలీవుడ్‌లో షూటింగ్‌లను మొదలు పెట్టడానికి అవకాశాలను వాళ్లు చర్చించారు.