వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు - మహేష్‌బాబు
on May 5, 2020
"సమాజానికి తమ రూపం చూపించకుండా ఉండే కొందరు వ్యక్తులు, డబ్బు కోసం ఏదైనా, ఏమైనా చేస్తారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. పాఠకులకు అబద్ధాలు చెబుతారు. మిమ్మల్ని కించపరుస్తారు. ఇదంతా వచ్చే నెల జీతం కోసమే" అని మహేష్ బాబు అన్నారు. ఫేక్ న్యూస్ ఆపాలంటూ ఒక మీడియా సంస్థపై విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, అతడికి మహేష్ మద్దతు పలికారు. అతడి వెంట ఉన్నామంటూ భరోసా ఇచ్చారు.
"కొన్నేళ్ల కఠోర శ్రమ, ప్రయత్నాలు, ప్రేమ, త్యాగాలతో ప్రజల ప్రేమ, గౌరవం పొందగలుగుతాం. భార్య ఆశించినట్టు మంచి భర్తగా ఉండడానికి, పిల్లలు కోరుకున్నట్టు సూపర్ హీరో తండ్రిగా ఉండడానికి, అభిమానులు కావాలనుకున్నట్టు సూపర్ స్టార్ గా ఉండడానికి శ్రమిస్తాం" అని మహేష్ బాబు అన్నారు. ఇంత శ్రమ పడుతుంటే... తమను కించపరుస్తున్న వెబ్‌సైట్స్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని కోరారు.
"తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, పాఠకులకు అబద్ధాలు చెప్పడం, డబ్బు కోసం ఏమైనా చేయడం సర్వ సాధారణం అనుకునే ప్రపంచం నుండి అందమైన తెలుగు సినిమా ఇండస్ట్రీని, నా అభిమానులను, నా పిల్లలను కాపాడాలని అనుకుంటున్నాను. ఫేక్ వెబ్‌సైట్స్ మీద చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీకి పిలుపు ఇస్తున్నా" అని మహేష్ బాబు పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
