మహేష్... 13 ఏళ్లకు నువ్వంత హైట్ లేవు!
on May 23, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు పదమూడేళ్లకు అంత హైట్ లేరని మంజులా ఘట్టమనేని తేల్చేశారు. ఎంత హైట్? ప్రస్తుతం మహేష్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఉన్నంత! ఇప్పుడీ హైట్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అంటే... లాక్‌డౌన్‌లో ఇంటిలో ఉంటున్న మహేష్ పిల్లలతో కలిసి జాలీగా, హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని కొన్ని విషయాలు చెక్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్... లేటెస్టుగా కుమారుడు గౌతమ్ ఎక్కువ హైట్ ఉన్నడా? తాను హైట్ ఉన్నారా? అని చెక్ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"హైట్ చెక్. హి ఈజ్ టాల్" (ఎవరెంత ఎత్తు ఉన్నారో చెక్ చేసుకుంటున్నాం) అని మహేష్ పేర్కొన్నారు. ఆయన వీడియో పోస్ట్ కింద మంజులా ఘట్టమనేని కామెంట్ చేశారు. "గౌతమ్ ఎత్తుగా ఉన్నాడని అనుకుంటున్నా. నువ్వు (మహేష్ ని ఉద్దేశిస్తూ) 13 ఏళ్ళ వయసులో వాడి ఎత్తుకు దగ్గర దగ్గరలో కూడా లేవు" అని అన్నారు. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి... ఆల్మోస్ట్ మహేష్ హైట్ కి గౌతమ్ రెండు మూడు అంగుళాలు తక్కువ ఉన్నాడు. ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాడంటే రెండు మూడేళ్ళలో మహేష్ కంటే పొడుగు అవుతాడని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
