సిటీలో మహేష్ ఆగడు ఇక !
on Apr 9, 2014
మహేష్ నటిస్తున్న "ఆగడు" చిత్ర టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా షూటింగ్ కూడా ఎక్కడా ఆగకుండా శరవేగంగా జరుగుతోంది. ఈనెల 10 వరకు హైదరాబాదులో ఓ షెడ్యుల్ జరుగుతుందని, ఆ తర్వాత బళ్లారిలో 5 రోజులు, గుజరాత్ లో 10 రోజులు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అదే విధంగా జమ్మూ-కాశ్మీర్ లో కొన్ని పాటలను చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారని తెలిసింది. మహేష్ ఇందులో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ అందిస్తున్న పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ భారీమొత్తంలో చెల్లించి దక్కించుకుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.