రేయ్ తెలుగులో ఇపుడే రాదంట
on Apr 9, 2014
సాయిధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రేయ్". ఎప్పటి నుంచో విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా, తెలుగులో కాకుండా కరేబియన్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని మే 9న వెస్టిండీస్ లో విడుదల చేయడానికి దర్శక, నిర్మాత వైవియస్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం గురించి వైవియస్ మాట్లాడుతూ... సినిమాను ఎక్కువ భాగం వెస్టిండీస్ లోని కరేబియన్ ప్రాంతంలో చిత్రీకరించం. కాబట్టి ఇక్కడి భాషలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నాం. ఒక తెలుగు సినిమా కరేబియన్ భాషలో విడుదల అవడం ఇదే మొదటిసారి అనుకుంటా" అని అన్నారు. శ్రద్దాదాస్, సయామీ ఖేర్ లు కథానాయికలు. చక్రి సంగీతం అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.